Cooking Tips And Tricks: వంటలో ఉప్పు ఎక్కువగా ఉంటే ఏం చేయాలో తెలుసా?
ABN , Publish Date - Jan 05 , 2026 | 03:24 PM
వంటలో ఉప్పు తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా ఆహారం రుచి మారిపోతుంది. కొన్నిసార్లు ఉప్పు ఎక్కువ పడితే వంటకం రుచి లేకుండా అవుతుంది. అయితే, కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా వంటకాన్ని మళ్ళీ రుచిగా మార్చవచ్చని మీకు తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: ఉప్పు వంటకు రుచిని ఇస్తుంది. వంటలో ఉప్పు చాలా ముఖ్యమైనది. ఇది తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా వంట రుచి పూర్తిగా మారిపోతుంది. అందుకే ఉప్పు సరైన మోతాదులో వేయాలి. కానీ కొన్నిసార్లు తెలియకుండానే వంటలో ఉప్పు ఎక్కువ పడుతుంది. అలా అయితే ఆహారం పాడైపోయిందని భయపడాల్సిన అవసరం లేదు. ఉప్పు ఎక్కువైతే వెంటనే వంట పారేయకుండా ఈ చిట్కాలు పాటించండి.
వంటలో ఉప్పు ఎక్కువగా ఉంటే ఏమి చేయాలి?
పెరుగు కలపండి: కూర లేదా గ్రేవీ ఎక్కువ ఉప్పగా ఉంటే, అందులో 1–2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి కొద్దిసేపు మరిగించండి. పెరుగు ఉప్పు రుచిని తగ్గిస్తుంది.
నగ పిండి ఉపయోగించండి: కాల్చిన శనగ పిండిని కొద్దిగా కలిపితే అదనపు ఉప్పు తగ్గి రుచి తగ్గిపోతుంది
బంగాళాదుంప వేయండి: ఉడికించిన బంగాళాదుంప ముక్కలను కూరలో కలపండి. అవి ఉప్పును పీల్చుకుంటాయి. పచ్చి బంగాళాదుంప ముక్కను కూడా కొద్దిసేపు వేసి తర్వాత తీసేయవచ్చు.
నిమ్మరసం చల్లి చూడండి: కాస్త నిమ్మకాయ రసం కలిపితే ఉప్పు రుచి సమతుల్యం అవుతుంది. కూరకు తాజా రుచుని వస్తుంది.
కొబ్బరి పాలు కలపండి: గ్రేవీ చాలా ఉప్పగా ఉంటే కొద్దిగా కొబ్బరి పాలు + నీరు కలిపి వేయండి. రుచి మెరుగవుతుంది.
చక్కెర లేదా బెల్లం: చాలా ఉప్పగా అనిపిస్తే చిటికెడు చక్కెర లేదా బెల్లం కలపండి. తీపి ఉప్పును సమతుల్యం చేస్తుంది.
ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే ఉప్పు ఎక్కువైన వంటను కూడా రుచిగా మార్చుకోవచ్చు.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా? ఈ ఆయుర్వేద చిట్కాలు ట్రై చేయండి.!
సూర్య నమస్కారాలు చేస్తే ఇన్ని లాభాలా..