కేవలం 45 పైసలతో రూ.10 లక్షల బీమా.. IRCTC ట్రావెల్ ఇన్సూరెన్స్
ABN , Publish Date - Jun 07 , 2026 | 01:01 PM
రైలు ప్రమాద బీమా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో పెరిగింది. అయితే రైలులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ ఈ బీమా వర్తించదని చాలామందికి తెలియదు.
ఇంటర్నెట్ డెస్క్: రైలు ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు లేదా వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు IRCTC ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయం అందుబాటులో ఉంది. అయితే ఈ బీమా ప్రయోజనాలు ప్రతి ప్రయాణికుడికి వర్తించవు.
IRCTC ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంపిక అందుబాటులో ఉంటుంది. ఈ ఆప్షన్‌ను ఎంచుకుని బీమా తీసుకున్న వారికి మాత్రమే ప్రమాద బీమా ప్రయోజనాలు లభిస్తాయి. బీమా తీసుకున్న ప్రయాణికుడు రైలు ప్రమాదంలో మరణించినా లేదా తీవ్రంగా గాయపడినా, నిబంధనల ప్రకారం పరిహారం అందుతుంది.
కేవలం 45 పైసలతో రూ.10 లక్షల రక్షణ
IRCTC ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం ప్రయాణికులు కేవలం 45 పైసల ప్రీమియం చెల్లించాలి. ఈ చిన్న మొత్తానికి గాను ప్రమాద మరణం లేదా శాశ్వత వికలాంగత్వం వంటి సందర్భాల్లో రూ.10 లక్షల వరకు బీమా రక్షణ లభిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో వైద్య ఖర్చులకు కూడా బీమా వర్తించే అవకాశం ఉంటుంది.
ఎవరికి వర్తిస్తుంది?
ఈ బీమా సదుపాయం కేవలం IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్లు కొనుగోలు చేసిన వారికి ఈ సదుపాయం వర్తించదు.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
టికెట్ బుకింగ్ సమయంలో ఇన్సూరెన్స్ ఆప్షన్‌ను ఎంచుకున్న తర్వాత, బీమా సంస్థ నుంచి ప్రయాణికుడి మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్‌కు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా నామినీ వివరాలు నమోదు చేయడం చాలా ముఖ్యం. నామినీ వివరాలు సరిగా నమోదు చేస్తే, భవిష్యత్తులో క్లెయిమ్ ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది. ప్రయాణ సమయంలో అనుకోని ప్రమాదాల నుంచి ఆర్థిక భద్రత పొందేందుకు IRCTC ట్రావెల్ ఇన్సూరెన్స్ ఒక ఉపయోగకరమైన సదుపాయంగా భావిస్తున్నారు.
Also Read:
ట్రావెల్ క్రెడిట్ కార్డు.. డిస్కౌంట్ల వెనుక దాగిన నిజం..
వర్షాకాలంలో ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి