IRCTC Tour Package: భక్తులకు శుభవార్త.. ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:42 AM
ఐఆర్సీటీసీ.. అయోధ్య నుంచి జగన్నాథ్‌పురి వరకు ప్రత్యేక భారత్ గౌరవ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 9 రోజులు, 10 రాత్రుల ఈ యాత్రలో గయ, వారణాసి, గంగాసాగర్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) తరచూ కొత్త టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. తాజాగా.. అయోధ్య నుంచి జగన్నాథ్‌పురి వరకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బడ్జెట్ టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. తక్కువ ఖర్చుతో ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం కల్పిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో గయ, పూరి జగన్నాథ్ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, కోల్‌కతా, గంగాసాగర్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.
టూర్ వివరాలు..
ఈ పర్యటన మొత్తం 9 రోజులు, 10 రాత్రులు ఉంటుంది. ఫిబ్రవరి 5న ప్రారంభమై.. అదే నెల 14న ముగుస్తుంది. ఈ యాత్ర ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ప్రారంభం కానుంది.
ప్రయాణంలో భాగంగా గయలోని విష్ణుపాద ఆలయం, పూరీలో జగన్నాథ్ ఆలయం, కోణార్క్‌లో సూర్య దేవాలయం, కోల్‌కతాలో గంగాసాగర్, వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయం, వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయం, అయోధ్యలో హనుమాన్‌గఢ్, శ్రీరామ ఆలయాలను సందర్శించవచ్చు.
ఈ టూర్‌లో మొత్తం 767 బెర్తులు అందుబాటులో ఉంటాయి. అందులో సెకండ్ ఏసీకి 49 సీట్లు, థర్డ్ ఏసీకి 70 సీట్లు, స్లీపర్ క్లాస్‌కు 648 సీట్లు ఉన్నాయి.
ప్యాకేజీలో ఏమేం ఉన్నాయంటే?
ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం(సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ లేదా స్లీపర్)
అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో శాకాహార భోజనం
అలాగే ఏసీ లేదా నాన్ ఏసీ బస్సుల్లో స్థానిక దర్శనాలు ఉంటాయి.
ప్యాకేజీ ధరలు..
స్లీపర్(ఎకానమీ) క్లాస్: పెద్దలకు ఒక్కొక్కరికి రూ.19,110;
పిల్లలకు (5–11 ఏళ్లు) రూ.17,950
థర్డ్ ఏసీ (స్టాండర్డ్) క్లాస్: పెద్దలకు రూ. 31,720;
పిల్లలకు రూ.30,360
సెకండ్ ఏసీ (కంఫర్ట్) క్లాస్: పెద్దలకు రూ. 41,980;
పిల్లలకు రూ.40,350
బుకింగ్ ఎలా చేయాలి?
ఈ టూర్ ప్యాకేజీని IRCTC టూరిజం అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్యాకేజీకి EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
దాంపత్య బంధం బలంగా ఉండాలంటే.. ఈ విషయాలు గుర్తించుకోండి..
మద్యం అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందో తెలిస్తే..
For More Latest News