దక్షిణాదిలో తప్పకుండా సందర్శించాల్సిన 5 ఫేమస్ టెంపుల్స్ ఇవే!
ABN , Publish Date - Oct 13 , 2026 | 02:16 PM
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళం, కర్ణాటకల్లో ప్రాచీనమైన, పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయి. వీటిని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని చాలా మంది ఆరాటపడుతుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాదిలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ఆలయాలెన్నో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళం, కర్ణాటకల్లో ప్రాచీనమైన, పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయి. వీటిని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. కళాత్మకంగా నిర్మించిన ఈ ఆలయాలను చూసి తరించాలని భావిస్తుంటారు. అలాంటి దేవాలయాల జాబితా ఇది.
1. మీనాక్షి అమ్మవారి ఆలయం, తమిళనాడు
తెలుగు వారికి మీనాక్షి అమ్మవారి ఆలయం సుపరిచితమే. తమిళనాడులోని ఈ ఆలయంలో మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ గోపురాల నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
2. రామనాథ స్వామి ఆలయం, తమిళనాడు
భారతదేశంలోని పవిత్రమైన ద్వాదశ (12) జ్యోతిర్లింగాలలో రామనాథ్ జ్యోతిర్లింగం (రామేశ్వర జ్యోతిర్లింగం) ఒకటి. ఈ ఆలయంలో కళాత్మకంగా చెక్కిన స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. చాలా మంది భక్తులు ప్రార్థనలు చేయడానికి ముందు ఆలయంలోని పవిత్ర బావులలో పుణ్యస్నానం ఆచరిస్తారు.
3. శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం, కేరళం
ఈ ఆలయం వాస్తు కళకు, శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి విష్ణుమూర్తి అరుదైన శయన భంగిమలో దర్శనమిస్తారు.
4. విరూపాక్ష దేవాలయం, హంపి(కర్ణాటక)
హంపి శిథిలాల మధ్య ఉన్న ఈ ఆలయాన్ని శతాబ్దాల నుంచి అత్యంత పుణ్యక్షేత్రంగా భక్తులు భావిస్తున్నారు. ఇక్కడ ప్రవేశ ద్వారాన్ని చూసిన వారు మైమరిచిపోతారంటే అతిశయోక్తి కాదు. ఈ ఆలయం చరిత్ర, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ప్రఖ్యాతి పొందింది.
5. బృహదీశ్వరాలయం, తంజావూరు (తమిళనాడు)
చోళుల కాలం నాటి వాస్తుశిల్పానికి ఈ బృహదీశ్వరాలయం చక్కటి ఉదాహరణ. ఇక్కడి రాతి శిల్పాలు అందరిని ఆకట్టుకుంటాయి. ఈ ఆలయం ప్రాచీన భారదేశపు కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది.
గమనిక: తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల గురించి మనకు ఇప్పటికే తెలుసు కాబట్టి వాటిని మినహాయించి ఈ జాబితాను రూపొందించాం.
ఈ వార్తలూ చదవండి
తిరుమల శ్రీవారి ఆలయ మహాగోపురం ప్రత్యేకతలు ఇవే..
అజంతా, ఎల్లోరా గుహలు చూడాలనుకుంటున్నారా?