బీచ్ ట్రిప్‌లో జాగ్రత్త! ఈ వస్తువులు తీసుకుంటే పర్యావరణానికి ముప్పు
ABN , Publish Date - Mar 21 , 2026 | 07:10 PM
బీచ్‌కి వెళ్లినప్పుడు అక్కడి అందమైన గవ్వలు, ఇసుక లేదా చిన్న వస్తువులను జ్ఞాపకంగా ఇంటికి తీసుకెళ్తుంటారు. కానీ అలా చేయడం పర్యావరణానికి హానికరమని చాలా మందికి తెలియదు.
ఇంటర్నెట్ డెస్క్: బీచ్‌కి వెళ్లినప్పుడు చాలా మందికి అక్కడి జ్ఞాపకంగా ఏదైనా వస్తువు తీసుకునే వెళ్లే అలవాటు ఉంటుంది. గవ్వలు, ఇసుక, చిన్న రాళ్లు ఇలా ఏదో ఒకటి తీసుకెళ్లడం సహజం. కానీ కొన్ని వస్తువులను బీచ్ నుంచి తీసుకురావడం ప్రకృతికి హానికరం. ఇప్పుడు బీచ్ నుంచి తీసుకురాకూడని ముఖ్యమైన వస్తువులు ఏవో చూద్దాం.
సముద్రపు గవ్వలు
బీచ్‌లో కనిపించే గవ్వలు చాలా అందంగా ఉంటాయి కాబట్టి చాలామంది వాటిని తీసుకెళ్తారు. కానీ ఇవి క్రమంగా ఇసుకగా మారి బీచ్‌ను కాపాడుతాయి. చిన్న సముద్ర జీవులకు ఆశ్రయంగా ఉంటాయి. కాబట్టి గవ్వలను తీసుకెళ్లడం వల్ల సహజ సమతుల్యత దెబ్బతింటుంది.

ఇసుక, చిన్న రాళ్లు
బీచ్‌లోని ఇసుక అనేది వేల సంవత్సరాల ప్రక్రియ ఫలితం. సముద్ర అలలు సహజంగా ఇసుకను మార్చుతుంటాయి. మనం తీసుకెళ్తే తీరప్రాంతం బలహీనపడుతుంది. ఎక్కువగా ఇసుక తీసుకోవడం వల్ల బీచ్‌లు మాయం అయ్యే ప్రమాదం ఉంది.
పగడపు శకలాలు
పగడాలు (corals) సముద్ర జీవవ్యవస్థలో చాలా ముఖ్యమైనవి. ఇవి కొత్త జీవులకు నివాసం కల్పిస్తాయి. సముద్ర నేలను స్థిరంగా ఉంచుతాయి. పగడాలను తీసుకోవడం వల్ల సముద్ర జీవవ్యవస్థకు నష్టం కలుగుతుంది.

సముద్ర జీవులు
స్టార్ ఫిష్, చిన్న పీతలు, సీ ఉర్చిన్లు వంటి జీవులను కొందరు ఇంటికి తీసుకెళ్తారు. ఇవి నీటి బయట ఎక్కువసేపు ఉండలేవు. వాటిని తాకడం కూడా వాటికి హానికరం. అందువల్ల జీవులను వారి సహజ వాతావరణంలోనే వదిలేయడం మంచిది.
సీవీడ్, డ్రిఫ్ట్‌వుడ్
బీచ్‌లో కనిపించే సీవీడ్ (పచ్చి మొక్కలు), డ్రిఫ్ట్‌వుడ్ కూడా ఉపయోగకరమైనవే. సీవీడ్ ఇసుకను కాపాడుతుంది. డ్రిఫ్ట్‌వుడ్ చిన్న జీవులకు ఆశ్రయం ఇస్తుంది. ఇవి తీసుకెళ్లడం వల్ల తీర ప్రాంత నిర్మాణం బలహీనపడే అవకాశం ఉంటుంది. బీచ్ అందాన్ని అలాగే కాపాడటం మన బాధ్యత. జ్ఞాపకార్థంగా వస్తువులు తీసుకెళ్లడం కన్నా, ఫొటోలు తీసుకుని ఆనందించడం మంచిది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం
పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి
For More Latest News