Sankranti Rangoli Significance: ముగ్గులు ఎందుకు వేస్తారు? ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా?
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:54 PM
సంక్రాంతి పండుగ అంటేనే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గోబ్బెమ్మలు కనిపిస్తాయి. అయితే, ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా? పండుగ రోజు ఎందుకు ముగ్గులు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: సంక్రాంతి పండుగ అంటేనే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల సందడి గుర్తుకొస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్లు తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు అందంగా ముగ్గులు వేయడం మన సంప్రదాయం. కానీ, ఈ ముగ్గులు ఎందుకు వేస్తారు? ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా? పండుగ రోజు ముగ్గులు ఎందుకు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
ముగ్గుల వెనుక ఉన్న సంప్రదాయ అర్థం..
మన పూర్వీకులు ప్రకృతి, పంటల మధ్య అనుబంధాన్ని చూపించేందుకు ముగ్గులు వేసేవారు. సంక్రాంతి రోజున పంట ఇంటికి రావడాన్ని స్వాగతిస్తూ.. భూమాతకు కృతజ్ఞతగా ముగ్గులు వేస్తారు. ఇది శుభ సంకేతంగా భావిస్తారు.

లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు..
హిందూ సంప్రదాయం ప్రకారం.. ముగ్గులు వేయడం ద్వారా ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. అందుకే సంక్రాంతి రోజులలో ప్రతి ఇంటి ముందు కొత్త ముగ్గులు వేస్తారు. ఇది సంపద, శాంతి, శుభాన్ని సూచిస్తుంది.
పర్యావరణానికి మేలు చేసే సంప్రదాయం
పూర్వం ముగ్గులు బియ్యం పిండి లేదా గోధుమ పిండితో వేస్తారు. దీని వల్ల చీమలు, పక్షులు వంటి చిన్న జీవులకు ఆహారం లభిస్తుంది. అంటే ఇది ప్రకృతి పట్ల మన బాధ్యతను చూపించే మంచి అలవాటు.

సాంస్కృతిక గుర్తింపు..
ముగ్గులు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. తర తరాలుగా ఈ కళ కొనసాగుతోంది. పెద్దలను చూసి పిల్లలు కూడా ముగ్గులు వేయడం నేర్చుకుంటూ వస్తున్నారు. ఇలా మన సంప్రదాయం ఒక తరం నుంచి మరో తరానికి చేరుతోంది.
శుభారంభానికి సంకేతం..
సంక్రాంతి కొత్త సంవత్సరానికి ఆరంభం లాంటిది. అందుకే ఇంటి ముందు ముగ్గులు వేసి శుభాలను ఆహ్వానిస్తారు. మంచి రోజులు రావాలని ఆకాంక్షిస్తూ ఈ సంప్రదాయం పాటిస్తారు.

మనసుకు ప్రశాంతత..
ముగ్గులు వేయడం ఒక రకమైన ధ్యానం లాంటిది. ఇది మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. రంగులు, ఆకృతులతో ముగ్గులు వేయడం వల్ల సానుకూల భావం పెరుగుతుంది. సంక్రాంతి సందర్భంగా ముగ్గులు వేయడం కేవలం అలంకరణ మాత్రమే కాదు.. ఇది సంస్కృతి, ప్రకృతి పట్ల మనకున్న ప్రేమ, కలయిక. మన పండుగలను మన సంప్రదాయాలతో కలిసి జరుపుకొంటేనే వాటి అసలైన అందం తెలుస్తుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News