మీకు ఇష్టమైన పండు మీ వ్యక్తిత్వాన్ని చెబుతుంది.!
ABN , Publish Date - May 18 , 2026 | 02:02 PM
మీకు ఇష్టమైన పండు ఆధారంగా మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చని ఈ పర్సనాలిటీ టెస్ట్ చెబుతోంది. ప్రతి పండు వెనుక ఒక ప్రత్యేక స్వభావం ఉంటుంది అని, మీరు ఎంచుకునే పండు మీ ఆలోచనలు, ప్రవర్తన, వ్యక్తిత్వం గురించి చెప్పగలదని నిపుణులు అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. శరీర ఆకృతి, ప్రవర్తన, ఆప్టికల్ ఇల్యూషన్ టెస్టులు ఇలా చాలా విధాలుగా మన స్వభావాన్ని అంచనా వేయవచ్చు. అలాగే, మనకు ఇష్టమైన పండ్ల ఆధారంగా కూడా వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చని చెబుతారు. పండ్లు ఆరోగ్యానికి మంచివి కాబట్టి అందరూ తింటారు. కానీ కొంతమందికి కొన్ని ప్రత్యేక పండ్లు ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టాల ఆధారంగా వారి స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం..
ఫేవరెట్ ఫ్రూట్ పర్సనాలిటీ టెస్ట్
నారింజ
నారింజ ఇష్టపడేవారు సహనంగా, నమ్మదగిన వ్యక్తులుగా ఉంటారు. నిజాయతీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఎక్కువగా ఆలోచించే స్వభావం ఉంటుంది.
మామిడి
మామిడి ఇష్టపడేవారు కొంచెం మొండి స్వభావం కలిగి ఉంటారు. కానీ నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచిస్తారు. హేతుబద్ధంగా ఆలోచించే గుణం ఉంటుంది.

అరటిపండు
అరటిపండు ఇష్టపడేవారు మంచి మనసు కలిగినవారు. స్నేహపూర్వకంగా, మర్యాదగా ఉంటారు. కానీ కొన్నిసార్లు ఇతరులు వీరి మంచితనాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
బేరిపండు
బేరిపండు ఇష్టపడేవారు చురుకుగా ఉంటారు కానీ త్వరగా కోపం వచ్చే స్వభావం ఉంటుంది. అయినా సంతోషంగా ఉండే గుణం కూడా ఉంటుంది.

ఆపిల్
ఆపిల్ ఇష్టపడేవారు ఆరోగ్యం, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తారు. అందరితో కలిసిపోవడం వీరి ప్రత్యేకత. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.
చెర్రీ
చెర్రీ ఇష్టపడేవారు కొంచెం సిగ్గుగా, ఇంట్రోవర్ట్‌గా ఉంటారు. చాలా సింపుల్‌గా ఉంటారు. ఇతరులను సులభంగా క్షమిస్తారు.

దానిమ్మ
దానిమ్మ ఇష్టపడేవారు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు. సహనం, సానుకూల ఆలోచనలు వీరి ప్రత్యేకత.
పుచ్చకాయ
పుచ్చకాయ ఇష్టపడేవారు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. సృజనాత్మకంగా, తెలివిగా ఉంటారు.

పైనాపిల్
పైనాపిల్ పండు ఇష్టపడేవారు జిజ్ఞాస ( ఏదైనా ఒక విషయాన్ని లోతుగా తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక) గలవారు. ఉత్సాహంగా ఉంటారు. స్వతంత్రంగా జీవించడానికి ఇష్టపడతారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
సిగరెట్లు తాగకపోయినా పెదాలు నల్లగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చేయండి
రాగి బాటిల్‌లో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు
For More Latest News