Share News

Mutton Biryani: మటన్ బిర్యానీ అంటే ఇష్టమా?.. ఆస్వాదించండి ఇలా..

ABN , Publish Date - Jan 10 , 2026 | 01:09 PM

బిర్యానీ అనగానే కమ్మటి ఘుమ ఘుమల వాసనతో నోరూరిస్తుంది. ఆహార ప్రియులు ఈ పేరెత్తగానే ఆహా అని నోరెళ్లబెడతారు. ఇక మటన్ బిర్యానీ గురించి వేరే చెప్పక్కర్లేదు. అయితే.. ఇది త్వరగా జీర్ణమవదనే భావన చాలామందిని వెంటాడుతూ ఉంటుంది. అలాంటివాటికి చెక్ పెట్టేలా మటన్ బిర్యానీని ఆస్వాదించే ఈ చిట్కాలు మీకోసం...

Mutton Biryani: మటన్ బిర్యానీ అంటే ఇష్టమా?.. ఆస్వాదించండి ఇలా..
Mutton Biryani

ఇంటర్నెట్ డెస్క్: మటన్ బిర్యానీ అంటే మృదువైన మటన్ ముక్కలు, సుగంధభరితమైన బాస్మతీ బియ్యం, వేయించిన ఉల్లిపాయలు, మసాలాలతో కూడిన ఓ అద్భుతమైన రుచికర వంటకం. ఘుమ ఘుమలాడే వాసన, మైమరిపించే రుచి మటన్ బిర్యానీ సొంతం. అందుకే ఎక్కువ మంది ఈ వంటకాన్ని ఇష్టపడుతుంటారు. అయితే.. మాంసం నుంచి లభ్యమయ్యే అధిక కొవ్వులు, బియ్యం నుంచి ఉత్పన్నమయ్యే అధిక కార్బోహైడ్రేట్ల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తడం లేదా బరువు పెరుగుతామనే ఆందోళన చాలా మందిని వెంటాడుతుంది. అందువల్ల కొందరు దీనికి దూరంగా ఉంటారు. అలా ఉండాల్సిన అవసరం లేదనీ.. ఆరోగ్యానికి హాని కలిగించకుండా దీనిని ఎలా ఆస్వాదించాలో నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే...


అమెరికన్ బోర్డ్-సర్టిఫైడ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ల ప్రకారం.. మటన్‌లో అధిక స్థాయి ప్రోటీన్లు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో సంతృప్త కొవ్వులు కూడా ఉంటాయి. ఇక బాస్మతీ రైస్ వేగంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్. ఈ రెండింటినీ ఒకేసారి అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిలోని అధిక కేలరీలు, రక్తంలో వేగంగా చక్కెర స్థాయులు పెరగటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల గ్లూకోజ్ పెరుగుదలను నియంత్రించేందుకు క్లోమంపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది.


ఫలితంగా.. డయాబెటిస్, ఫ్యాటీలివర్, బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆహారానికి దూరంగా ఉండటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు గణనీయంగా పెరుగుతాయన్నారు. అంతేకాకుండా శరీరం గంటల తరబడి అలసిపోయినట్టు లేదా నీరసంగా(మత్తుగా) అనిపిస్తుందని చెబుతున్నారు.


ఆస్వాదించే మార్గాలివిగో..

  • కొన్ని ఆహారాలను పూర్తిగా నివారించడం కంటే మితంగా తీసుకోవడం మంచిది. ప్రభావవంతమైన ఆహారాన్ని తీసుకునే సమయంలో వాటికి స్మార్ట్ ఫుడ్‌ను జోడిస్తే సరి.

  • అన్ని ఆహార పదార్థాలను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఎంచుకుని తీసుకోవడం ఉత్తమం.

  • బిర్యానీలో కార్బోహైడ్రేట్ల సమతుల్యతను సాధించడానికి గ్రిల్డ్ చికెన్ లేదా ఉడికించిన గుడ్లు వంటి లీన్ మాంసాహారాన్ని తీసుకోవడం.

  • ఒక కప్పు స్టార్చ్‌లేని కూరగాయలు లేదా సలాడ్ జోడించి తీసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన ఫైబర్ లభిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది.

  • బిర్యానీ తినాలనుకున్నప్పుడు రాత్రివేళల్లో కాకుండా.. ముందుగా తినేలా ప్లాన్ చేసుకోండి. తద్వారా శరీరంలో ఆహారం పూర్తిగా జీర్ణం కావడానికి తగినంత సమయం లభిస్తుంది.


ఇవీ చదవండి:

మటన్ తిన్న వెంటనే పొరపాటున కూడా వీటిని తినకండి..

బియ్యం వండడానికి ముందు ఎందుకు నానబెట్టాలో తెలుసా?

Updated Date - Jan 10 , 2026 | 01:27 PM