Share News

ఉదయం ఈ 8 పొరపాట్లు అస్సలు చేయకండి

ABN , Publish Date - Nov 22 , 2026 | 09:54 AM

ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైతే ఆ రోజంతా ప్రశాంతంగా, ఉత్సాహంగా గడుస్తుంది. కానీ.. ఈ తప్పులు చేశారో.. రోజంతా అసహనంతో గడపాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందామా..

ఉదయం ఈ 8 పొరపాట్లు అస్సలు చేయకండి
morning habits to avoid

ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైతే ఆ రోజంతా ప్రశాంతంగా, ఉత్సాహంగా గడుస్తుంది. కానీ.. ఈ తప్పులు చేశారో.. రోజంతా అసహనంతో గడపాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందామా..

1. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ను స్కిప్ చేయడం

పనుల హడావుడిలో టైం లేదంటూ.. చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేసి.. బయటికి వెళ్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఏం తినకుండా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గి.. రోజంతా అలసటగా ఉంటుంది. ఏకాగ్రత తగ్గుతుంది. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల.. లంచ్‌లో అతిగా తింటుంటారు. దీని వల్ల శరీరానికి సమతుల్య ఆహారం అందదు. అందుకే ఉదయాన్నే శక్తినిచ్చే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. తృణధాన్యాలు, ప్రోటీన్లు, పండ్లను ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవడం ఉత్తమం.


2. ఖాళీ కడుపున కాఫీ, టీ తాగడం

చాలా మందికి లేవగానే కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. దీని వల్ల అసిడిటీ పెరుగుతుంది. జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. అసిడిటీ, గుండెల్లో మంట, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యను అధిగమించడానికి.. ఉదయం ఏదైనా అల్పాహారం తీసుకున్న తర్వాత టీ, కాఫీలు తీసుకోవడం ఉత్తమం. అసలు టీ, కాఫీలు మానేయడం చాలా శ్రేయస్కరం.


3. లేవగానే ఫోన్‌ను చెక్ చేయడం

రాత్రి పడుకోవడానికి ముందు, ఉదయం లేవగానే ఫోన్‌ను చూడాల్సిందే. లేవగానే ఫోన్ చూడడం వల్ల.. నోటిఫికేషన్లు, మెసేజ్‌లు మీ ప్రశాంతతను డైవర్ట్ చేస్తుంది. దృష్టిని మరల్చుతుంది. మానసికంగా ఒత్తిడిని పెంచుతుంది. ఈ భావోద్వేగాల సమతుల్యతను కాపాడుకోవడానికి.. లేవగానే ఫోన్‌ను చెక్ చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఫోన్‌ను ఉదయం ఎక్కువ సేపు వినియోగించకూడదు.

4. లేవగానే నీరు తాగకపోవడం

రాత్రి పూట నిద్ర కారణంగా నీటిని తీసుకోలేం. శరీరం రాత్రంతా ద్రవాలను కోల్పోతుంది. ఉదయం లేవగానే సరిపడా నీటిని తాగడం వల్ల శరీరానికి అవసరమైన ద్రవాలు తిరిగి అందుతాయి. ఉదయం పూట నీరు తాగకపోవడం వల్ల తలనొప్పి, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఇది మలబద్దకానికి దారి తీస్తుంది. ఇది రోజంతా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందుకే ఉదయాన్నే సరిపడా నీళ్లు తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా గడపవచ్చు.


5. సూర్యకాంతి తగలకుండా ఉండడం

ఉదయం లేవగానే కాసేపు ఎండలో గడపాలి. సూర్యరశ్మి శరీరానికి కావాల్సిన విటమిన్ ‘డి’ని పుష్కలంగా అందించడంతో పాటు.. మానసిక ప్రశాంతతను కలిగించే హార్మోన్ల విడుదలకు సహాయపడుతుంది. అందుకే లేవగానే కాసేపు ఎండలో గడిపితే రోజంతా ప్రశాంతంగా.. ఉత్సాహంగా గడుస్తుంది.

6. తొందరపాటుతనం

ఉదయం లేవగానే.. అన్నీ త్వరత్వరగా చేసేయాలనుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది రక్తపోటుకు దారితీస్తుంది. దీని వల్ల ఒత్తిడి హార్మోన్లు అధికంగా విడుదల అవుతాయి. ఇవన్నీ మీ నిర్ణయాత్మక శక్తిపై ప్రభావం చూపుతాయి. ఏ నిర్ణయాన్ని సరిగా తీసుకోలేకపోతారు. అందుకే సరైన ప్రణాళిక వేసుకోవడం.. దాన్ని అమలు చేయడం వల్ల తొందరపాటు తగ్గుతుంది. ఏకాగ్రత పెరగడం వల్ల రోజంతా ప్రశాంతంగా.. ఉత్పాదకంగా ఉంటుంది.


7. వ్యాయామం చేయకపోవడం

శరీర ఆరోగ్యం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తేలికపాటి నడక, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీని వల్ల చాలా ఆరోగ్య సమస్యలను అదుపులోకి తెచ్చుకోవచ్చు. రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది.

8. ప్రాసెస్డ్ ఫుడ్‌ను తీసుకోవడం

ప్రాసెస్డ్ ఫుడ్ రుచిగా ఉండవచ్చు. వంట చేసే సమయాన్ని ఆదా చేయవచ్చు. కానీ ఉదయం లేవగానే ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీని వల్ల రోజంతా అసౌకర్యంగా ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకూ ప్రాసెస్డ్ ఫుడ్‌ను తగ్గించాలి. సరళమైన ఆహారాన్ని తీసుకోవాలి.

Updated Date - Nov 22 , 2026 | 09:59 AM