Share News

బూట్ల దుర్వాసనకు ఇలా చెక్ పెట్టండి.!

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:57 PM

బూట్లు ఎంత క్లీన్‌గా ఉన్నా, చెమట వల్ల వాటిలో దుర్వాసన వస్తుంటుంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో ఈ సమస్యను నివారించవచ్చు.

 బూట్ల దుర్వాసనకు ఇలా చెక్ పెట్టండి.!
Remedies For Smelly Shoes

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో చాలా మంది బూట్లు ధరిస్తుంటారు. అవి ఎంత శుభ్రంగా ఉంచినా, చెమట వల్ల వాటిలో దుర్వాసన రావడం సాధారణమే. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో ఈ సమస్యను తగ్గించవచ్చు.


ఎండలో ఉంచడం

బూట్లలో తేమ ఉండటం వల్ల బ్యాక్టీరియా పెరిగి దుర్వాసన వస్తుంది. కాబట్టి బూట్లను కొంతసేపు ఎండలో ఉంచితే తేమ తొలిగి, దుర్వాసన తగ్గుతుంది.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా.. తేమను, దుర్వాసనను గ్రహిస్తుంది. రాత్రి పడుకునే ముందు బూట్లలో కొద్దిగా బేకింగ్ సోడా చల్లి, ఉదయం వాటిని శుభ్రం చేాయాలి. ఇది దుర్వాసనను తగ్గించడంలో సాయపడుతుంది.


టీ బ్యాగులు

టీ బ్యాగుల్లో ఉండే టానిన్లు బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. వాడిన టీ బ్యాగులను బూట్లలో రాత్రంతా ఉంచితే దుర్వాసన తగ్గుతుంది.

వెనిగర్ స్ప్రే

వెనిగర్‌ను నీటితో కలిపి స్ప్రే బాటిల్‌లో వేసి బూట్ల లోపల స్ప్రే చేయాలి. వెనిగర్‌లో ఉన్న యాంటీబాక్టీరియల్ గుణాలు దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను తగ్గిస్తాయి.

నిమ్మకాయ లేదా నారింజ తొక్కలు

రాత్రివేళ.. బూట్లలో నిమ్మకాయ లేదా నారింజ తొక్కలను ఉంచి, ఉదయం తీసివేయాలి. ఇవి సహజ సువాసన ఇచ్చి దుర్వాసనను తగ్గిస్తాయి. ఈ సులభమైన చిట్కాలను పాటిస్తే బూట్లలో వచ్చే దుర్వాసనను సులభంగా తగ్గించుకోవచ్చు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

మునగాకు సూప్ ఎలా చేయాలో తెలుసా?

మార్కెట్లో కల్తీ అల్లం.. కొనేముందు ఇది తెలుసుకోండి.!

For More Latest News

Updated Date - Feb 07 , 2026 | 01:50 PM