మటన్ కీమా.. రుచిగా రావాలంటే ఇలా వండండి
ABN , Publish Date - Mar 01 , 2026 | 02:18 PM
సండే వచ్చిదంటే చాలు ముక్క తినాల్సిందే. నాన్ వెజ్ ప్రియులకు సండే అంటే పండగతో సమానం. చాలా మంది సండే రోజున మటన్ వండుకుని తినడానికి ఆసక్తి చూపుతారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి సండే ఒకే రకమైన మటన్ కర్రీ తినడం కంటే ఈ సారీ మటన్ కీమా ట్రై చేయండి. మటన్ కీమా.. తినే కొద్దీ తినాలనిపించే అద్భుతమైన కర్రీ.. ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది. టేస్టీగా చేస్తే గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. ఇంట్లో రుచిగా మటన్ ఖీమా వండడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు:
మటన్ కీమా– 500 గ్రాములు
ఉల్లి – 2 (చిన్న ముక్కలు)
టమాటా – 2 (చిన్న ముక్కలు)
పచ్చిమిర్చి – 3–4 (ముక్కలు)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
కారం – 1 టీస్పూన్
ధనియాల పొడి – 1 టీస్పూన్
జీలకర్ర పొడి – ½ టీస్పూన్
గరం మసాలా – ½ టీస్పూన్
నూనె – 2 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర – సర్వింగ్ కోసం
తయారీ విధానం:
కుక్కర్ లేదా కడాయిలో నూనె వేడి చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
శుభ్రం చేసిన కీమాను వేసి నూనెలో 5-7 నిమిషాల పాటు బాగా వేయించాలి.
తర్వాత టమోటా ముక్కలు, పుదీనా వేసి టమోటాలు మెత్తబడే వరకు ఉడికించాలి.
ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, మసాలా దినుసులు, ఉప్పు వేసి కలపాలి.
అవసరమైతే కొద్దిగా నీరు పోసి కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు లేదా కీమా పూర్తిగా ఉడికే వరకు ఉడికించాలి.
మూత తీసి గరం మసాలా చల్లి నూనె పైకి తేలే వరకు 2-3 నిమిషాలు వేయించి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
చిట్కాలు:
మీకు కావాలంటే కీమాలో బఠానీలు కూడా వేసుకోవచ్చు.
చివరగా కొద్దిగా నిమ్మరసం కలిపితో రుచి ఇంకా బాగుంటుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి
కంటి నొప్పి మెదడు సమస్యకు సంకేతమా?
For More Latest News