Eating Sweets Safely: స్వీట్లు తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:40 PM
పండుగలు, వేడుకలు అంటే స్వీట్లు తప్పనిసరి. కానీ జాగ్రత్తలు లేకుండా ఎక్కువగా స్వీట్లు తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే స్వీట్లు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు.
ఇంటర్నెట్ డెస్క్: స్వీట్లు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. పండుగలైనా, పెళ్లిళ్లైనా.. సంతోషకర సందర్భమేదైనా సరే స్వీట్లు ఉండాల్సిందే. మన సంస్కృతిలో స్వీట్లు పంచుకోవడం ఆనందానికి గుర్తు. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఎక్కువగా స్వీట్లు తింటే.. అవి ఆరోగ్యానికి హానికరంగా మారతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కువగా స్వీట్లు తినడం వల్ల డయాబెటిస్, ఫ్యాటీ లివర్, అధిక కొలెస్ట్రాల్, PCOD, అలాగే కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులూ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే స్వీట్లు పూర్తిగా మానేయాలని కాదు.. కానీ వాటిని కొంచెం జాగ్రత్తగా, అవసరమైనంత మాత్రమే తినాలని సూచిస్తున్నారు. స్వీట్లు తినేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే ఆరోగ్యానికి హానిలేకుండా తీపిని ఆస్వాదించవచ్చని చెబుతున్నారు.

పండ్లను డ్రై ఫ్రూట్స్‌తో కలిపి తినండి..
పండ్లలో సహజంగా ఉండే చక్కెర.. రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచుతుంది. అందుకే పండ్లను బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటి డ్రైఫ్రూట్స్‌తో కలిపి తినాలి. ఇలా తింటే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగదు. క్రమంగా శక్తి అందుతుంది.

డార్క్ చాక్లెట్ తినండి..
వేడుకల సమయంలో చాలా మంది మిల్క్ చాక్లెట్ లేదా స్వీట్లు తీసుకుంటారు. వాటి బదులుగా డార్క్ చాక్లెట్ తీసుకోవడం మంచిది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది, యాంటీఆక్సిడెంట్లనూ అందిస్తుంది.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న స్వీట్లు తీసుకోండి..
కేక్, ఐస్‌క్రీమ్ లాంటి వాటికి బదులుగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్(GI) ఉన్న స్వీట్లు తినండి. ఇంట్లో తయారుచేసిన డ్రై ఫ్రూట్ లడ్డూలు, చియా గింజలతో చేసే లడ్డూలు వంటివి తీసుకోండి. ఇవి నెమ్మదిగా జీర్ణమై రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా చేస్తాయి.

సహజ స్వీటెనర్లను వాడండి..
శుద్ధి చేసిన చక్కెర ఆరోగ్యానికి హానికరం. అందుకే వాటికి బదులుగా బెల్లం, తేనె, ఖర్జూర లాంటి సహజ తీపి పదార్థాలు వాడటం మంచిది. ఇవి తీపి ఇవ్వడమే కాకుండా కొంత పోషకాలనూ అందిస్తాయి. కానీ ఇవి సహజమైనవైనా సరే.. ఎక్కువగా కాకుండా అవసరమైనంత మాత్రమే తినాలని వైద్యులు చెబుతున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
రోజూ పాలు తాగుతున్నారా.. ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..
విటమిన్ సప్లిమెంట్స్ ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి..
For More Latest News