Beetroot Juice vs Raw: బీట్‌రూట్ జ్యూస్‌గా తాగాలా.. లేక పచ్చిగా తినాలా.?
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:50 PM
బీట్‌రూట్ ఆరోగ్యానికి అద్భుతమైన సూపర్ ఫుడ్. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడం, బరువు తగ్గించడం, చర్మ కాంతిని మెరుగుపరచడం వంటి ఎన్నో ప్రయోజనాలు దీనిలో ఉన్నాయి. అయితే.. బీట్‌రూట్‌ను ఎలా తీసుకుంటే మంచిది? జ్యూస్‌గా తాగాలా.. లేక పచ్చిగా తినాలా.? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: బీట్‌రూట్ ఆరోగ్యానికి అద్భుతమైన సూపర్ ఫుడ్. రక్తాన్ని పెంచడం, బరువు తగ్గించడం, చర్మ కాంతిని మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. ఇనుము, ఫోలేట్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉన్న బీట్‌రూట్‌ను ఎలా తింటే మంచిదో తెలుసా? జ్యూస్‌గా తాగాలా? లేక పచ్చిగా తినాలా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బీట్‌రూట్‌ను సరైన విధానంలో తీసుకుంటే ఆరోగ్యంపై మరింత మంచి ప్రభావం చూపుతుంది.
బీట్‌రూట్ పచ్చిగా తింటే కలిగే ప్రయోజనాలు
బీట్‌రూట్‌ను పచ్చిగా తినడం ద్వారా అందులోని ఫైబర్, విటమిన్లు, మినరల్స్ నేరుగా శరీరానికి అందుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది.
బీట్‌రూట్ జ్యూస్ ప్రయోజనాలు
బీట్‌రూట్ జ్యూస్ శరీరానికి వెంటనే శక్తినిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో తాగితే రక్తహీనత, అలసట, బలహీనత సమస్యలు తగ్గుతాయి.
ఏది బెస్ట్
నిజానికి రెండూ మంచివే. శరీరానికి పూర్తి ప్రయోజనం కావాలంటే వారానికి 3–4 సార్లు పచ్చిగా, 2–3 సార్లు జ్యూస్‌గా తీసుకోవడం ఉత్తమం. మీ శరీర అవసరానికి అనుగుణంగా మారుస్తూ తీసుకోవచ్చు.
జాగ్రత్తలు
రోజుకు 1 చిన్న బీట్‌రూట్ తీసుకుంటే సరిపోతుంది. అధికంగా తీసుకోకండి.
కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి.
మొదటిసారి తింటే చిన్న పరిమాణంతో ప్రారంభించండి.
బీట్‌రూట్‌ను జ్యూస్‌గా తాగినా, పచ్చిగా తిన్నా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కానీ సరైన సమయంలో, సరైన పరిమాణంలో తీసుకుంటేనే ప్రయోజనాలు పొందుతారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News