Share News

మిక్సర్ గ్రైండర్ బ్లేడ్లను ఇంట్లోనే ఇలా పదును పెట్టండి

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:01 PM

ఇంట్లో తరచుగా వాడే మిక్సర్ గ్రైండర్ బ్లేడ్లు కాలక్రమేణా మొద్దుబారిపోతాయి. అయితే కొత్త బ్లేడ్ కొనాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే ఉన్న సాధారణ పదార్థాలతో సులభంగా బ్లేడ్లను మళ్లీ పదును పెట్టుకోవచ్చు.

మిక్సర్ గ్రైండర్ బ్లేడ్లను ఇంట్లోనే ఇలా పదును పెట్టండి
Mixer Grinder Blade Sharpening Tips

ఇంటర్నెట్ డెస్క్: మన ఇంట్లో మసాలాలు, చట్నీలు, దోసె పిండి, జ్యూస్ తయారికీ మిక్సర్ గ్రైండర్‌ను తరచుగా వాడుతాం. ఇలా ఎక్కువగా వాడడం వల్ల గ్రైండర్‌ బ్లేడ్లు క్రమంగా మొద్దుబారిపోతాయి. దీని వల్ల ఆహార పదార్థాలు సరిగా గ్రైండ్ అవ్వవు. అయితే కొత్త బ్లేడ్ కొనాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే కొన్ని సులభమైన చిట్కాలతో వాటిని పదును పెట్టవచ్చు.


గుడ్డు పెంకులు

ముందుగా గుడ్డు పెంకులను శుభ్రం చేసి ఆరబెట్టాలి. తర్వాత వాటిని మిక్సర్ జార్‌లో వేసి కొన్ని సెకన్లు తిప్పాలి. పెంకుల గరుకుదనం బ్లేడ్ల పదునును పెంచుతుంది.

రాతి ఉప్పు

జార్‌లో ఒక టేబుల్ స్పూన్ రాతి ఉప్పు వేసి మిక్సీను కొద్దిసేపు ఆన్ చేయాలి. ఉప్పు కణాలు బ్లేడ్లను తేలికగా రుద్ది పదును పెడతాయి.

ఐస్ క్యూబ్స్‌

కొన్ని ఐస్ క్యూబ్స్‌ను జార్‌లో వేసి బ్లెండ్ చేయాలి. ఐస్ గట్టిదనం బ్లేడ్లను శుభ్రపరచి, మెరుగుపరుస్తుంది.


బేకింగ్ సోడా

బేకింగ్ సోడాను కొద్దిగా నీటితో కలిపి పేస్ట్ తయారు చేసి, బ్లేడ్లకు పూయాలి. 5 నిమిషాల తర్వాత బ్రష్‌తో మెల్లగా రుద్ది శుభ్రం చేయాలి. ఇది జిడ్డు, మురికిని తొలగిస్తుంది.

అల్యూమినియం ఫాయిల్

ఒక చిన్న అల్యూమినియం ఫాయిల్ ముక్కను ఉండలా చుట్టి జార్‌లో వేసి కొన్ని సెకన్లు మిక్సీ ఆన్ చేయాలి. ఇది బ్లేడ్లను కొంచెం సరిచేసి పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ చిట్కాలను పాటిస్తే, మిక్సర్ బ్లేడ్లు మళ్లీ పదును పెంచుకుని బాగా పని చేస్తాయి. తరచూ శుభ్రం చేస్తూ ఉంటే బ్లేడ్లు ఎక్కువ కాలం ఉపయోగపడతాయి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..

ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..

For More Latest News

Updated Date - Apr 29 , 2026 | 12:50 PM