విరిగిన బొమ్మలు ఇంట్లో ప్రతికూలతకు కారణమవుతాయా?
ABN , Publish Date - Apr 20 , 2026 | 07:12 PM
పిల్లల గదిలో ఉండే చిన్న చిన్న విషయాలు కూడా వారి మానసిక స్థితి, ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా విరిగిన లేదా పాడైన బొమ్మలను ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: పిల్లలకు బొమ్మలే ప్రపంచం. రంగురంగులుగా, వివిధ ఆకారాల్లో ఉండే బొమ్మలు పిల్లలను వెంటనే ఆకర్షిస్తాయి. వాటితోనే ఎక్కువ సమయం గడుపుతూ, వాటిని చాలా ప్రేమగా చూసుకుంటారు. కొంతమంది పిల్లలు నిద్రపోయేటప్పుడు కూడా తమకు ఇష్టమైన బొమ్మలను పక్కన పెట్టుకుని పడుకుంటారు. ఇలా పిల్లలకి బొమ్మలతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది.
అయితే బొమ్మలతో ఆడుకుంటూ ఉండగా అవి పగిలిపోవడం లేదా పాడవడం సహజం.. కొందరు పిల్లలు వాటిపై ఉన్న మమకారం వల్ల విరిగిపోయిన బొమ్మలను కూడా అలాగే ఇంట్లో ఉంచుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం, విరిగిన బొమ్మలను ఇంట్లో ఎక్కువకాలం ఉంచడం మంచిది కాదు. ఇవి ఇంటి వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అంటారు.
విరిగిన బొమ్మలు ఎందుకు మంచివి కావు?
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఒక శక్తిని కలిగి ఉంటుంది. విరిగిన లేదా పాడైన బొమ్మలు ప్రతికూలతను పెంచుతాయని భావిస్తారు. ముఖ్యంగా పిల్లల గదిలో ఇవి ఉండటం వల్ల వారి ఏకాగ్రత తగ్గి, ప్రవర్తనపై కూడా ప్రభావం పడవచ్చు.
పిల్లల గది ఎలా ఉండాలి?
పిల్లల గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. విరిగిన లేదా ఉపయోగించని బొమ్మలను తొలగించడం మంచిది. శుభ్రమైన వాతావరణం పిల్లల్లో సానుకూల ఆలోచనలను పెంచుతుంది.
దానం చేసే సమయంలో జాగ్రత్త
పాత బొమ్మలను దానం చేయడం మంచి అలవాటే. అయితే పూర్తిగా పాడైనవి లేదా పిల్లలకు ప్రమాదకరంగా ఉండే బొమ్మలను ఇవ్వడం సరైంది కాదు. ఎప్పుడూ బాగున్న, సురక్షితంగా ఉపయోగించగలిగే బొమ్మలనే దానం చేయాలి. కొద్దిగా దెబ్బతిన్న బొమ్మలు ఉంటే వాటిని సరి చేయించి మళ్లీ ఉపయోగించవచ్చు. కానీ పూర్తిగా విరిగిపోయిన బొమ్మలను ఇంట్లో ఉంచకపోవడం మంచిది. అలాగే పిల్లలకు తమ బొమ్మలను జాగ్రత్తగా వాడడం, అవసరం లేని వస్తువులను పోగు చేయకుండా ఉండటం నేర్పించడం కూడా ముఖ్యం. ఇవి వారి జీవితంలో పరిశుభ్రత, బాధ్యత వంటి మంచి అలవాట్లను పెంపొందించడంలో సహాయపడతాయి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!
ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!
For More Latest News