చాణక్య నీతి.. వైవాహిక జీవితంలో చీలికలకు ఈ అంశాలే ప్రధాన కారణం!
ABN , Publish Date - Feb 22 , 2026 | 01:46 PM
వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే, భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం, నమ్మకం ఉండటం చాలా ముఖ్యం. చిన్న చిన్న కారణాల వల్ల కూడా వైవాహిక బంధం దూరమవుతుంది. వైవాహిక జీవితంలో చీలికకు ప్రధాన కారణమయ్యే అంశాలను, వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను వివరించారు. ఈ సూచనలను పాటిస్తే భార్యాభర్తలు సంతోషంగా జీవించవచ్చు. అదే సమయంలో కొన్ని అలవాట్లు, ఆచారాలు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి వైవాహిక జీవితంలో చీలికకు కారణమయ్యే ముఖ్య అంశాలేమిటో చూద్దాం.
కమ్యూనికేషన్ లేకపోవడం..
సంబంధాన్ని బలోపేతం చేయడంలో మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. చిన్న చిన్న విభేదాల విషయంలో మౌనంగా ఉంటే దూరం పెరుగుతుంది. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడూ మౌనంగా ఉండకూడదు. అలాగే నిజాయతీగా ఉండటం కూడా చాలా ముఖ్యం.
స్వార్థం..
భర్త లేదా భార్య తమ సొంత ఉపయోగం కోసం మాత్రమే చూస్తూ, ఒకరిపై మరొకరు ప్రేమ చూపించకపోతే.. సంబంధం శాశ్వతంగా ఉండదు. కాబట్టి సంబంధంలో స్వార్థం ఉండకూడదు.
అహంకారం..
అహంకారం ఉన్నప్పుడు సంబంధం దెబ్బతింటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య ఎట్టిపరిస్థితుల్లోనూ అహం దరిచేరకూడదు. అలాగే ఒకరి పట్ల ఒకరు గౌరవం చూపడం చాలా ముఖ్యం.
కోపం..
ప్రతి చిన్న సమస్యపై కోప్పడటం ఘర్షణలకు దారితీస్తుంది. కాబట్టి విభేదాల కోసం కోపం ప్రదర్శించకూడదు. అలాగే కోపంలో భర్త లేదా భార్య రహస్యాలను ఇతరులకు చెప్పకూడదు. ఈ సూత్రాలను పాటిస్తే భార్యాభర్తల మధ్య సానుభూతి, గౌరవం, ప్రేమ, నమ్మకం పెరుగుతుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?
పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
For More Latest News