Share News

జీవితంలో ఈ విషయాల గురించి ఎప్పుడూ సిగ్గుపడకండి..

ABN , Publish Date - Mar 23 , 2026 | 02:51 PM

జీవితంలో కొన్ని విషయాల్లో ఎప్పుడూ సిగ్గుపడకూడదని ఆచార్య చాణక్యుడు సూచించారు. అయితే, ఆయన ఇలా ఎందుకు అన్నారో, ఏ విషయాల గురించి ఇలా చెప్పారో వివరంగా తెలుసుకుందాం..

జీవితంలో ఈ విషయాల గురించి ఎప్పుడూ సిగ్గుపడకండి..
Chanakya Niti Teachings

ఇంటర్నెట్ డెస్క్: ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితానికి సంబంధించిన అనేక విషయాలను వివరించారు. విజయం, సంపద ఈ రెండింటిని సాధించడానికి ఏమి చేయాలో ఆయన చెప్పారు. అలాగే జీవితంలో ముందుకు సాగాలంటే కొన్ని విషయాల గురించి ఎప్పుడూ సిగ్గుపడకూడదని కూడా ఆయన చెప్పారు.


ఇతరులు, సమాజం మన గురించి ఏమనుకుంటారో అనే భయం, ఆందోళన, సిగ్గు కారణంగా చాలామంది తాము చేయాలనుకున్న పనులను చేయడానికి సంకోచిస్తారు. అలా సంకోచిస్తే విజయం సాధించడం, జీవితంలో ముందుకు సాగడం కష్టమని చాణక్యుడు హెచ్చరించారు. ముఖ్యంగా ఈ విషయాల్లో సిగ్గుపడితే, మనం జీవితంలో ఎప్పటికీ ఎదగలేమని పేర్కొన్నారు.

అభిప్రాయాలను వ్యక్తపరచడం:

కొంతమంది తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడానికి సంకోచిస్తారు. చాణక్యుడి ప్రకారం, ఇతరుల ముందు మీ అభిప్రాయాలను ధైర్యంగా చెప్పాలి. ఎవరైనా తప్పు చేస్తే, అది తప్పు అని చెప్పడంలో సంకోచించకూడదు. అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పలేని వ్యక్తి జీవితంలో విజయం సాధించలేడు. తన కోసం మాట్లాడలేని వ్యక్తి ఇతరుల కోసం కూడా నిలబడలేడు.


తినడానికి సంకోచించకండి:

కొంతమంది ఇతరుల ముందు తినడానికి సిగ్గుపడతారు. కానీ ఆహారం మన శరీరానికి ప్రాథమిక అవసరం. దాని గురించి ఎప్పుడూ సిగ్గుపడకూడదు అని చాణక్యుడు చెప్పారు. ఆహారం విషయంలో సిగ్గుపడే వ్యక్తి తనకు తానే కష్టాన్ని కొని తెచ్చుకుంటాడు.

డబ్బు అడిగేటప్పుడు సిగ్గుపడకండి:

డబ్బు అప్పుగా తీసుకోవడం మంచిది కాదు, ఎందుకంటే అది రుణ భారాన్ని పెంచుతుంది. కానీ అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అడగడంలో ఎప్పుడూ సిగ్గుపడకూడదు. అయితే, మీరు తిరిగి చెల్లించగలిగితేనే డబ్బు అడగాలి.


జ్ఞానాన్ని సంపాదించడానికి సిగ్గుపడవద్దు:

చాణక్యుడి ప్రకారం, జ్ఞానం లేదా మంచి విషయాలు నేర్చుకోవడానికి సిగ్గుపడకూడదు. సందేహాలను అడిగి తెలుసుకోవాలి. జ్ఞానం సంపాదించడంలో సంకోచించే వారు జీవితంలో ముందుకు సాగలేరు. కాబట్టి, ఎప్పుడూ జ్ఞానం సంపాదించడానికి సిగ్గుపడకూడదని చాణక్యుడు సూచించారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం

పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి

For More Latest News

Updated Date - Mar 23 , 2026 | 03:53 PM