Share News

ట్రంప్‌ విధానాలతో భారత్‌, చైనాలకే అధికంగా చిక్కులు!

ABN , Publish Date - Mar 23 , 2026 | 02:11 PM

ట్రంప్ ప్రభుత్వ విధానాలతో భారత్, చైనా దేశాలే ఎక్కువగా ఇబ్బందుల పాలయ్యాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భారత్, చైనా విద్యార్థులకు జారీ అయ్యే వీసాల్లో భారీగా కోత పడినట్టు వెలుగులోకి వచ్చింది.

ట్రంప్‌ విధానాలతో భారత్‌, చైనాలకే అధికంగా చిక్కులు!
Impact Of Trump Policies on India, China

ఇంటర్నెట్ డెస్క్: వలసలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో భారత్, చైనాలే ఎక్కువగా అవస్థల పాలవుతున్నాయని తాజాగా వెలుగులోకి వచ్చింది. 2024తో పోలిస్తే 2025లో జారీ అయిన వీసాల సంఖ్యలో 2.5 లక్షల మేర కోత పడినట్టు వెలుగులోకి వచ్చింది.

గతేడాది జనవరి-ఆగస్టు మధ్య కాలంలో జారీ అయిన వీసాలు, గ్రీన్ కార్డుల సంఖ్య అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11 శాతం తక్కువని ఇటీవల విడుదలైన ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ కాలంలో టూరిస్టు వీసాల సంఖ్య కూడా బాగా తగ్గినట్టు వాషింగ్టన్ పోస్టు ఒక కథనాన్ని ప్రచురించింది.


2024 జనవరి- ఆగస్టు మధ్య కాలంలో అమెరికా 3.44 లక్షల స్టూడెంట్ వీసాలు జారీ చేయగా 2025 ఇదే కాలంలో ఈ సంఖ్య 2.38 లక్షలకు పడిపోయింది. ఫ్యామిలీ ప్రిఫరెన్స్ వీసాల సంఖ్య కూడా 44 వేల మేర (27 శాతం) తగ్గిపోయింది. 2024తో పోలిస్తే 2025లో భారతీయులు, చైనీయులకు జారీ అయిన వీసాల్లో ఏకంగా 84 వేల మేర కోత పడింది. ఇక 2025లో జారీ అయిన బిజినెస్, టూరిజం వీసాల్లో కూడా 2024తో పోలిస్తే 3.4 శాతం మేర కోత పడింది.

ఈ మీడియా కథనాలపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు. వీసా అంటే విదేశీయులకు ఇచ్చే ప్రత్యేక అవకాశం మాత్రమేనని, హక్కు కాదని స్పష్టం చేశారు. అమెరికా ప్రజల భద్రతకు ముప్పు తెచ్చేలా దేశంలోకి విదేశీయులను భారీ స్థాయిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతించబోరని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన ఎయిర్ కెనడా విమానం.. నలుగురి పరిస్థితి విషమం!

వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ

Updated Date - Mar 23 , 2026 | 02:24 PM