విటమిన్ ఇ క్యాప్సూల్ ముఖానికి ఉపయోగపడుతుందా?
ABN , Publish Date - May 24 , 2026 | 02:50 PM
విటమిన్ E క్యాప్సూల్స్ చర్మానికి ఎంతవరకు ఉపయోగపడతాయి? వాటిని ముఖానికి ఎలా సరైన విధంగా ఉపయోగించాలి? వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: చర్మాన్ని మెరిసేలా ఉంచుకోవడానికి చాలా మంది మహిళలు తమ స్కిన్ కేర్ రొటీన్‌లో విటమిన్ E నూనె లేదా క్యాప్సూల్స్‌ను ఉపయోగిస్తుంటారు. విటమిన్ Eలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాలుష్యం, ఎండలోని హానికర కిరణాలు, ఫ్రీ రాడికల్స్ ప్రభావం నుంచి రక్షించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే చర్మానికి తేమను అందించి పొడిబారకుండా కాపాడుతాయని సూచిస్తున్నారు.
అయితే విటమిన్ E నూనె చాలా మందంగా, జిడ్డుగా ఉండటం వల్ల కొంతమందికి చర్మ రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జిడ్డు చర్మం లేదా మొటిమల సమస్య ఉన్నవారు దీనిని నేరుగా వాడితే మొటిమలు పెరగడం, చర్మం చికాకుగా మారడం వంటి సమస్యలు రావచ్చు.
విటమిన్ ఇ క్యాప్సూల్ లోని నూనెను నేరుగా ముఖానికి పట్టించుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు రాసుకుని, ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. దీనిని నేరుగా లేదా మీ మాయిశ్చరైజర్‌లో కలిపి వాడవచ్చు. అంతేకాకుండా, విటమిన్ E సీరమ్‌ను కూడా ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సీరమ్ తేలికగా ఉండి చర్మంలో సులభంగా కలిసిపోతుంది.
విటమిన్ E చర్మానికి తేమను అందించి కొంతవరకు మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే లోతైన మచ్చలను పూర్తిగా తొలగించాలంటే నిపుణుల సలహా అవసరం. విటమిన్ Eను రోజుకు ఒకటి లేదా రెండు సార్లు వాడొచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పగటిపూట వాడితే తప్పనిసరిగా సన్‌స్క్రీన్ కూడా ఉపయోగించాలి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
సిగరెట్లు తాగకపోయినా పెదాలు నల్లగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చేయండి
రాగి బాటిల్‌లో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు