సహజ సౌందర్యం కోసం బెస్ట్ స్కిన్ కేర్ టిప్
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:44 PM
సహజ సౌందర్యం కోసం రాత్రి పడుకునే ముందు ఈ చిట్కాను ప్రయత్నించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సింపుల్ హోమ్ రెమెడీని క్రమం తప్పకుండా పాటిస్తే చర్మ సమస్యలు తగ్గి సహజమైన కాంతి లభిస్తుందని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నిద్రపోయే ముందు ఒక సింపుల్ హోమ్ రెమెడీని ఉపయోగిస్తే చర్మం సహజంగా కాంతివంతంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. కొబ్బరి నూనెను కలబంద జెల్‌తో కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు.
ఇంటి బయట ఎక్కువగా పని చేసే వారు తమ చర్మం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే చర్మం పొడిబారడం, మచ్చలు వంటి సమస్యలు రావచ్చు. ఈ సమస్యలను తగ్గించడానికి కొబ్బరి నూనె చాలా ఉపయోగపడుతుంది.
క్రమం తప్పకుండా
రాత్రి పడుకునే ముందు కలబంద జెల్, కొబ్బరి నూనె మిశ్రమాన్ని ముఖానికి రాసి సుమారు 10 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తేమ అందుతుంది. ఈ మిశ్రమాన్ని రోజూ రాత్రి ఉపయోగిస్తే మాత్రమే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అప్పుడప్పుడు వాడితే పెద్దగా మార్పు ఉండదు. నిరంతరంగా వాడితే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
సహజమైన ఇంటి చిట్కా
ఇది చర్మానికి లోతుగా తేమను అందించి పొడిబారడాన్ని తగ్గిస్తుంది. అలాగే మచ్చలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రసాయన ఉత్పత్తుల బదులు ఇలాంటి సహజమైన ఇంటి చిట్కాను ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
హెల్తీ పీనట్ బటర్ రెసిపీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా
కిడ్నీ బాధితులు పుచ్చకాయ తినడం మంచిదేనా?
For More Latest News