Share News

వేసవిలో ఎయిర్ కూలర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ABN , Publish Date - Mar 16 , 2026 | 05:31 PM

వేసవి కాలం వచ్చిందంటే చాలు, సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ సెగలు పుట్టిస్తుంటాడు. ఈ ఎండల నుంచి తప్పించుకోవడానికి మధ్య తరగతి ఇళ్ళలో ఏసీల కంటే ఎక్కువగా కనిపించేవి ఎయిర్ కూలర్లు.

వేసవిలో ఎయిర్ కూలర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Air Cooler Safety Tips

ఇంటర్నెట్ డెస్క్: వేసవి కాలం వచ్చిందంటే చాలు, సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ సెగలు పుట్టిస్తుంటాడు. ఈ ఎండల నుంచి తప్పించుకోవడానికి మధ్య తరగతి ఇళ్ళలో ఏసీల కంటే ఎక్కువగా కనిపించేవి ఎయిర్ కూలర్లు. తక్కువ ఖర్చు, విద్యుత్ వినియోగంతో గదిని చల్లబరిచే అద్భుతమైన సాధనం కూలర్. అయితే, సరైన అవగాహన లేకుండా కూలర్ వాడటం వల్ల గదిలో ఉక్కపోత పెరగడమే కాకుండా, పాత నీటి వల్ల దోమలు చేరి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, క్లీనింగ్ సరిగా లేకపోతే గాలి ద్వారా అలర్జీ కూడా రావచ్చు. అందుకే, మీ కూలర్ కేవలం గాలిని మాత్రమే కాకుండా ‘ఏసీ స్థాయి’ చల్లదనాన్ని, స్వచ్ఛమైన గాలిని అందించాలంటే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

చాలా మంది కూలర్ వేసి తలుపులన్నీ మూసేస్తారు. దీని వల్ల గదిలో తేమ పెరిగి ఉక్కపోత కారణంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

కూలర్ ను ఎప్పుడూ కిటికీకి ఎదురుగా లేదా బయట గాలి తగిలేలా ఉంచాలి. గాలి బయటకు వెళ్లడానికి వీలుగా ఎదురుగా ఉన్న కిటికీని కొంచం తెరిచి ఉంచితే మంచిది.

air cooler.jpgకూలర్ నుంచి వచ్చే చల్లని గాలికి అత్యంత కీలకమైనది దాని గడ్డి. గడ్డి బాగా లేకుంటే చల్లటి గాలి రావు. అందువల్ల.. వేసవి సీజన్‌లో కూలర్‌ను ఉపయోగించే వారు మొదట దాని గడ్డి పరిస్థితిని చెక్ చేసుకోవాలి.

గడ్డిపై దుమ్ము పూర్తిగా పేరుకుపోతే, గాలి సరిగ్గా గడ్డి గుండా వెళ్లదు. పైగా దుమ్ము వల్ల అలర్జీ, ఇతర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

కొంతమంది గడ్డి మార్చే విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. రెండు, మూడు సంవత్సరాల వరకు కూలర్‌ని అలాగే నడుపుతుంటారు.

air coole6r.jpgఎక్కువ కాలం గడ్డిని శుభ్రం చేయకుండా ఉంచితే, నల్లగా మారి దుమ్ము పేరుకుపోతుంది. అంటే తప్పని సరి గడ్డిని మార్చడానికి సంకేతం.

ప్రతి రెండు సీజన్లలో ఒకసారి కూలర్ గడ్డిని తప్పకుండా మార్చాలి. గడ్డి సాధ్యమైనంత వరకు తేమగా ఉండేలా చూడాలి.

చాలా మంది కూలర్ లో నీరు పెట్టకుండా, పంపును నడిపిస్తూనే ఉంటారు. ఇలా పదే పదే చేస్తే, అది పంపుపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో పంపు వేడెక్కి కూలర్‌లో మంటలు చెలరేగే ప్రమాదం ఉంది.

ianncollar.jpgఇనుప కూలర్ వాడేవారు ఒక సంవత్సరం తర్వాత దానికి పెయింటింగ్ వేయడం మంచింది

ఇనుప కూలర్లలో విద్యుత్ షాక్‌కు ప్రధాన కారణాలు సరిగా ఎర్తింగ్ లేకపోవడం, వైర్లు వదులుగా ఉండటం, నీటితో సంబంధం కలిగి ఉండటం.

కనెక్ట్ చేస్తున్నప్పుడు, కూలర్ ఐరన్ పవర్ అందుకుంటుందో లేదో మీరు టెస్టర్‌తో చెక్ చేసుకోవాలి.

colle4.jpgచిన్న పిల్లలు ఉన్న చోట ఎయిర్ కూలర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పిలులు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.

వేసవి కాలంలో చాలా చోట్ల కూలర్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకే కూలర్ చల్లగాలి కోసమే కాదు, దాని వల్ల వచ్చే ప్రమాదాలను నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read

వేసవిలో బయటకు వెళ్లే ముందు ఈ స్కిన్‌కేర్ తప్పనిసరి
బొప్పాయి తినడానికి సరైన సమయం తెలుసా?

For More Latest News

Updated Date - Mar 16 , 2026 | 05:31 PM