అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు చిన్నారులతో సహా 8 మందికి గాయాలు..
ABN , Publish Date - Jul 05 , 2026 | 08:23 PM
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ న్యూయార్క్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. నగరంలోని బ్రూక్లిన్‌లో ఉన్న కోనీ ఐలాండ్ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ న్యూయార్క్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. నగరంలోని బ్రూక్లిన్‌లో ఉన్న కోనీ ఐలాండ్ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులతో సహా మొత్తం ఎనిమిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు (Coney Island Shooting).
జులై 4 రాత్రి బాణాసంచా ప్రదర్శన ముగిసిన కొద్దిసేపటికే కోనీ ఐలాండ్‌లోని సర్ఫ్ అవెన్యూ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించడంతో అక్కడ ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో నలుగురు పిల్లలతో సహా మొత్తం ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించారు (New York Shooting).
గాయపడిన వారిలో 21 ఏళ్ల మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు (Brooklyn Shooting). మిగిలిన బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఘటనా స్థలంలో ఒక తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు పాల్పడింది ఎంతమంది? వారి ఉద్దేశం ఏమిటి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
ఇవి కూడా చదవండి..
హోర్ముజ్‌లో సేవా రుసుం.. మిత్ర దేశాలకు ప్రత్యేక రాయితీలు: ఇరాన్
సోషల్ మీడియా వల్ల విభేదాలు.. భార్యను చంపేసిన భర్త..