ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు
ABN , Publish Date - Jul 08 , 2026 | 06:42 AM
శాంతి ఒప్పందాన్ని పక్కన పెట్టేసి ఇరాన్ హోర్ముజ్‌లో వాణిజ్య నౌకలపై దాడులు చేయడంతో అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. మంగళవారం ఖేష్మ్ ఐల్యాండ్, బందర్ అబ్బాస్, సిరిక్ వంటి 10 ప్రాంతాల్లో దాడులు చేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ రెవల్యూషనరీ కార్ప్స్ గార్డ్స్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు నౌకలపై ఐఆర్‌జీసీ మిస్సైల్స్ ప్రయోగించింది. ఈ దాడుల్లో నౌకలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. అయితే.. ఈ దాడుల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మరో ఘటనలో.. ఒమన్‌లోని లిమా తీరంలో దక్షిణ దిశగా ప్రయాణిస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్‌ను పేలుడు వస్తువు బలంగా ఢీకొట్టింది. ట్యాంకర్ దెబ్బతింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఇరాన్ దాడులకు పాల్పడటంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు
శాంతి ఒప్పందాన్ని పక్కన పెట్టేసి ఇరాన్ హోర్ముజ్‌లో వాణిజ్య నౌకలపై దాడులు చేయడంతో అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. మంగళవారం ఖేష్మ్ ఐల్యాండ్, బందర్ అబ్బాస్, సిరిక్ వంటి 10 ప్రాంతాల్లో దాడులు చేసింది. ఇరాన్ దురాక్రమణ ప్రమాదకరం, సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించడమేనని అమెరికా పేర్కొంది. వాణిజ్య నౌకలపై దాడికి ప్రతిస్పందనగానే దాడులు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ బుధవారం ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో..
‘అంతర్జాతీయ జలమార్గంలో అమాయక పౌరులు ఉన్న వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ ఇందుకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే. యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు శక్తివంతమైన దాడులను ప్రారంభించాయి. హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఈ దాడులు చేస్తోంది. ఇరాన్ దురాక్రమణ నిరాధారమైనది, ప్రమాదకరమైనది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే’ అని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
రూ. 60 వేల కోట్లతో దేశవ్యాప్తంగా పీఎంసేతు అమలు