Share News

ఎన్విడియా సీఈఓ ఎఫైర్ వెనుక చైనా కుట్ర లేదు.. యూఎస్ నిఘా అధికారులు

ABN , Publish Date - Nov 26 , 2026 | 09:40 AM

జెన్సన్-ఆలిస్ ఎఫైర్ వెనుక చైనా హస్తం లేదని అమెరికా నిఘా వర్గాలు అంచనాకు వచ్చినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఎన్విడియా సీఈఓ ఎఫైర్ వెనుక చైనా కుట్ర లేదు.. యూఎస్ నిఘా అధికారులు
US Intelligence Finds no Evidence of China Orchestration

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో కలకలానికి దారి తీసిన ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ఎఫైర్ ఉదంతం దాదాపు ముగింపునకు వచ్చేసినట్టే కనిపిస్తోంది. ఈ ఎఫైర్ వెనుక చైనా హస్తం లేదని అమెరికా నిఘా వర్గాలు అంచనాకు వచ్చినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇప్పటికే జెన్సన్ ఎన్విడియా సీఈఓగా పునర్ నియమితులైన విషయం తెలిసిందే. జెన్సన్‌కు ఆలిస్ దగ్గరవ్వడం వెనుక చైనా నిఘా వర్గాల ముందస్తు వ్యూహం ఉందనేందుకు ఆధారాలు లభించలేదని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి.


జెన్సన్, ఆలిస్‌ల బంధం వారి వ్యక్తిగతమైనదని అధికారులు తేల్చారు. ఈ మేరకు యూఎస్ నిఘా అధికారులు కాంగ్రెషనల్ సిబ్బందికి ఓ సమావేశంలో తెలిపినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ సమావేశంలో అమెరికా నిఘా సంస్థ సీఐఏతో పాటు ఎఫ్‌బీై అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే, జెన్సన్‌తో బంధంలో ఉన్న సమయంలోనే ఆలిస్ చైనా నిఘా వర్గాలతో టచ్‌లో ఉందని అమెరికా అధికారులు చెప్పారు. కానీ, వారికి కావాల్సిన కీలక సమాచారాన్ని ఆలిస్ అందించినట్టు ఆధారాలు లభించలేదని అన్నారు. ఆలిస్ భర్త కాంగ్ వీ చైనా నిఘా వర్గాలకు కీలకమైన వ్యక్తిగా అమెరికా అధికారులు పేర్కొన్నారు. అయితే, ఆలిస్‌కు అమెరికా క్లీన్ చిట్ ఇవ్వలేదని కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఆలిస్ పరిచయస్తులు, చైనాకు ఎన్విడియా చిప్‌ల దారిమళ్లింపు అమెరికా దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.


ఇక కాంగ్రెషనల్ అధికారులతో జరిగిన సమావేశంలో అమెరికా నిఘా అధికారులు కొంత కీలక సమాచారాన్ని పంచుకోనట్టు అమెరికా మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ ఎఫైర్‌కు సంబంధించి అమెరికా మంత్రి మార్కో రూబియో దృష్టికి వచ్చిన నివేదిక గురించి యూఎస్ అధికారులు కాంగ్రెస్ వర్గాలతో పంచుకోలేదని సమాచారం.


ఈ వార్తలనూ చదవండి:

మళ్లీ ట్రంప్‌ సుంకాలు!

విశ్వసుందరిగా జెన్నిఫర్‌ బారెటో

Updated Date - Nov 26 , 2026 | 09:51 AM