Share News

50 శాతం సుంకాలు విధిస్తాం.. ట్రంప్ తాజా హెచ్చరిక

ABN , Publish Date - Apr 08 , 2026 | 07:26 PM

ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణను ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి హెచ్చరికలు చేశారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు.

50 శాతం సుంకాలు విధిస్తాం.. ట్రంప్ తాజా హెచ్చరిక
Donlad trump

వాషింగ్టన్: ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణను ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా మరోసారి హెచ్చరికలు చేశారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు. తమ దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి చేసే దేశాలపై ఈ టారిఫ్‌లు విధిస్తామన్నారు. ఈ విషయంలో ఏ దేశాన్ని మినహాయించేది లేదని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు పేర్కొన్నారు.


ఇరాన్‌తో కుదిరిన ఒప్పందంలో భాగంగా యురేనియం ఎన్రిచ్‌మెంట్ ప్రోగ్రాంను నిలిపివేసేందుకు ఆ దేశం అంగీకరించిందని ట్రంప్ దీనికి ముందు ప్రకటించారు. తాజా పరిణామాలను పాలనాపరమైన మార్పుగా పేర్కొన్నారు. ఇరాన్‌పై సుంకాలు, ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించేందుకు ఆదేశంతో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో ఆ దేశంలో కలిసి చేస్తామన్నారు. అణుకేంద్రాలపై దాడుల వల్ల ఏర్పడిన వ్యర్థ పదార్ధాలను ట్రెహ్రాన్ సహాయంతో వెలికితీసి తొలగిస్తామని చెప్పారు. కాల్పుల విరమణ ప్రతిపాదనలోని 15 ఆంశాల్లో చాలామటుకు ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపారు. మిలటరీ లక్ష్యాలను తాము దాదాపు సాధించినట్టు ప్రకటించారు.


ఇవి కూడా చదవండి..

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ.. తెర వెనుక చైనా..

ఇరాన్‌కు మంచి రోజులు.. అమెరికా సహాయం చేస్తుంది: డొనాల్డ్ ట్రంప్

Updated Date - Apr 08 , 2026 | 07:42 PM