Share News

చైనా టూర్‌కు ముందు ట్రంప్ సీక్రెట్ లెటర్.. నాకేమైనా అయితే..

ABN , Publish Date - May 14 , 2026 | 02:02 PM

చైనా టూర్‌లో ఉండగా తనకేమైనా అయితే ఏం చేయాలనేదానిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్షుడు వాన్స్‌కు సీక్రెట్ లేఖ వదిలివెళ్లినట్టు శ్వేతసౌధం అధికారి ఒకరు తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో తెలిపారు.

చైనా టూర్‌కు ముందు ట్రంప్ సీక్రెట్ లెటర్.. నాకేమైనా అయితే..
Trump Letter to Vance in Resolute Desk

ఇంటర్నెట్ డెస్క్: చైనా టూర్‌కు వెళ్లేముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు సీక్రెట్ లెటర్ రాశారు. తాను గనక చనిపోతే ఏం చేయాలనేదానిపై వాన్స్‌కు లేఖలో స్పష్టమైన సూచనలను చేశారు. ఈ మేరకు శ్వేతసౌధం కౌంటర్ టెర్రరిజమ్ అధికారి గోర్కా తాజాగా కీలక విషయాలను వెల్లడించారు. ప్రముఖ వార్తాసంస్థ న్యూయార్క్ పోస్టు‌కు చెందిన పాడ్‌కాస్ట్‌లో ఈ వివరాలను పంచుకున్నారు. విదేశీ పర్యటనలపై వెళ్లే ముందు ప్రతిసారీ అమెరికా అధ్యక్షుడు ఈ సీక్రెట్ లేఖను వాన్స్ కోసం వదిలివెళతారని తెలిపారు.

‘ట్రంప్ వినియోగించే రిసొల్యూట్ డెస్క్‌లోని సొరుగులో వాన్స్‌ కోసం ఈ లేఖ ఉంటుంది. తాను చనిపోతే ఏం చేయాలనే దానిపై ట్రంప్ ఇందులో స్పష్టమైన సూచనలు ఇస్తారు’ అని అన్నారు. చైనా పర్యటనలో కూడా ట్రంప్‌పై హత్యాయత్నానికి అవకాశాలు ఉంటాయా? అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ..‘ప్రతి సందర్భంలో అనుసరించాల్సిన విధివిధానాలు ఉంటాయి.. మీతో అన్నీ చెప్పలేను కానీ చాలా ప్రొటోకాల్స్ ఉంటాయి’ అని ఆయన వివరించారు.


ఇటీవల ఇరాన్‌పై దాడులకు మునుపు కూడా ట్రంప్ ఇలాంటి కామెంట్స్ చేశారు. ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో తనకేమైనా అయితే ఏం చేయాలనే విషయంలో వాన్స్‌కు చాలా స్పష్టమైన సూచనలు చేశానని చెప్పారు. ‘నాకు గనక ఏమైనా అయితే ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేయాలని చెప్పాను. బాంబుల వర్షం కురిపించాలని చెప్పాను’ అంటూ ఇరాన్‌ను ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

ఫ్రాన్స్ అధ్యక్షుడి చెంప ఛెళ్లుమనిపించిన భార్య.. మీడియాలో కథనాలు

చైనా అధినేతతో శిఖరాగ్ర సమావేశం.. జిన్‌పింగ్‌పై ట్రంప్ ప్రశంసలు

Updated Date - May 14 , 2026 | 02:52 PM