Share News

ఇరాన్‌తో ఒప్పందం విషయంలో తొందరపడడం లేదు: డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - May 25 , 2026 | 09:37 AM

ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ఒప్పందం దాదాపు పూర్తయిందని ఆదివారం చెప్పిన ట్రంప్ తాజాగా మాట మార్చారు. ఒప్పందం ఇంకా చర్చల దశలోనే ఉందని తెలిపారు.

ఇరాన్‌తో ఒప్పందం విషయంలో తొందరపడడం లేదు: డొనాల్డ్ ట్రంప్
Donald Trump

ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ఒప్పందం దాదాపు పూర్తయిందని ఆదివారం చెప్పిన ట్రంప్ తాజాగా మాట మార్చారు. ఒప్పందం ఇంకా చర్చల దశలోనే ఉందని తెలిపారు. అణు కార్యక్రమం, యురేనియం నిల్వలు, ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయని సమాచారం (Trump Iran peace deal).


'చర్చలు సక్రమంగా కొనసాగుతున్నాయి. కానీ తొందరపడి ఒప్పందం చేసుకోము. చర్చల కోసం తగినంత సమయం తీసుకోవాలని మా అధికారులకు సూచించాను. ఈ డీల్ ఓ కొలిక్కి వచ్చేంత వరకు హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల దిగ్బంధనం కొనసాగుతుంది' అని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతా 'ట్రూత్'లో ఓ పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ముడి చమురు రవాణా సాధారణ స్థితికి రావడం ఇప్పట్లో సాధ్యం కాదని అర్థమవుతోంది (US Iran talks).


యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు రెండు వేల నౌకలు పర్షియల్ గల్ఫ్‌లో చిక్కుకుపోయాయి (Trump Iran negotiations). ఇప్పటికిప్పుడు హోర్ముజ్ జలసంధిని తెరిచినా నౌకాయానం సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టొచ్చు. హోర్ముజ్ ద్వారా ప్రయాణం పూర్తి సురక్షితమని షిప్పింగ్ సంస్థలు నమ్మితే తప్ప నౌకాయానం స్వేచ్ఛగా సాగదు. అలాగే హోర్ముజ్‌లో అమర్చిన సీమైన్స్ తొలగించడానికి ఎంత సమయం పడుతుందనేది కూడా తెలియదు.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Updated Date - May 25 , 2026 | 09:37 AM