Share News

వైట్‌హౌస్ దగ్గర కాల్పులు.. ఆందోళన వ్యక్తం చేసిన ట్రంప్..

ABN , Publish Date - May 24 , 2026 | 12:21 PM

వైట్‌‌హౌస్ వద్ద చోటుచేసుకున్న కాల్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ది ట్రూత్ సోషల్’లో ఆదివారం ఉదయం ఓ పోస్టు పెట్టారు.

వైట్‌హౌస్ దగ్గర కాల్పులు.. ఆందోళన వ్యక్తం చేసిన ట్రంప్..
White House shooting

న్యూయార్క్, మే 24: అమెరికాలోని వైట్‌‌హౌస్ వద్ద చోటుచేసుకున్న కాల్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ది ట్రూత్ సోషల్’లో ఆదివారం ఉదయం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘వైట్‌హౌస్ దగ్గర కాల్పులకు తెగబడ్డ దుండగుడిపై సీక్రెట్ సర్వీస్ అధికారులు, పోలీసులు చాలా వేగంగా చర్యలు తీసుకున్నారు. దుండగుడికి నేర చరిత్ర ఉంది. వైట్‌హౌస్ గేట్ల దగ్గర దుండగుడికి, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అతడు చనిపోయాడు’..
trump-truth.jpg


‘వైట్‌హౌస్ కరెస్పాండెంట్ డిన్నర్ షూటింగ్ జరిగిన నెల రోజుల్లోనే ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన భవిష్యత్ అధ్యక్షులకు సురక్షితమైన ప్రదేశం ఎంత అవసరమో స్పష్టంగా చెబుతోంది. జాతీయ భద్రతకు ఇది చాలా అవసరం’ అని పేర్కొన్నారు. కాగా, సంఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. కాల్పుల కారణంగా ట్రంప్ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం ఏర్పడలేదు.


ఇంతకీ ఏం జరిగిందంటే..

శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మేరిల్యాండ్‌కు చెందిన 21 ఏళ్ల నాసిర్ బెస్ట్ 17వ స్ట్రీట్‌, పెన్సిల్వేనియా ఎవెన్యూ సమీపంలోని సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్లపై కాల్పులకు తెగబడ్డాడు. ఆఫీసర్లు జరిపిన ఎదురు కాల్పుల్లో గాయాలపాలైన దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. సెక్యూరిటీ పాయింట్ దగ్గర నాసిర్ బెస్ట్ 20 నుంచి 25 రౌండ్ల దాకా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి గాయపడ్డాడు. సెక్యూరిటీ ఆఫీసర్లకు ఏమీ కాలేదు.


ఇవి కూడా చదవండి

ఇరాన్‌తో ఒప్పందం దాదాపు ఖాయం.. శాంతి చర్చలపై ట్రంప్ పోస్ట్..

ఘనంగా మాజీ గవర్నర్ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సభ..

Updated Date - May 24 , 2026 | 12:27 PM