Share News

ఘనంగా మాజీ గవర్నర్ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సభ..

ABN , Publish Date - May 24 , 2026 | 11:57 AM

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత ప్రస్థానాన్ని ఆవిష్కరించే ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ రోజు (ఆదివారం) విశాఖ మద్దిలపాలెంలోని కాకతీయ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

ఘనంగా మాజీ గవర్నర్ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సభ..
Bandaru Dattatreya

విశాఖపట్నం: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత ప్రస్థానాన్ని ఆవిష్కరించే ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ రోజు (ఆదివారం) విశాఖ మద్దిలపాలెంలోని కాకతీయ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దత్తాత్రేయ రాజకీయ జీవితం, ప్రజా సేవా, సామాన్య ప్రజలతో ఆయనకి ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ ఆత్మీయ అవలోకనం పుస్తకాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. అలాగే ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జీవీఎల్ నర్సింహారావు సహా పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రజల మధ్య నుంచి ఎదిగి గవర్నర్ పదవికి వరకు చేరుకున్న దత్తాత్రేయ జీవిత ప్రయాణం యువతకు ఆదర్శప్రాయమని కంభంపాటి హరిబాబు అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, ప్రజల ఆశీర్వాదాలే తన జీవితానికి బలమని బండారు దత్తాత్రేయ అన్నారు. పుస్తకానికి ‘ప్రజల కథే నా ఆత్మకథ’ అనే పేరు పెట్టడం వెనుక కూడా అదే ఉద్దేశ్యం ఉందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

నంద్యాల జిల్లా సున్నిపెంటలో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు..

మా ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి నారాయణ ధ్వజం

Updated Date - May 24 , 2026 | 11:58 AM