Share News

మనసు మార్చుకున్న ట్రంప్.. అణు ఒప్పందం లేకుండానే యుద్ధం ముగింపు?

ABN , Publish Date - Aug 10 , 2026 | 07:21 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధం విషయంలో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అణు ఒప్పందం లేకుండానే ఆయన యుద్ధాన్ని ముగించాలని భావిస్తున్నారని సమాచారం.

మనసు మార్చుకున్న ట్రంప్.. అణు ఒప్పందం లేకుండానే యుద్ధం ముగింపు?
Trump Iran war

ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధం విషయంలో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అణు ఒప్పందం లేకుండానే ఆయన యుద్ధాన్ని ముగించాలని భావిస్తున్నారని సమాచారం. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం మేరకు.. గత కొన్ని నెలలుగా ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా విజయం సాధించిందని ట్రంప్ ప్రకటన చేయబోతున్నారు. అంతర్జాతీయ రవాణా కోసం ఇరాన్ 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్'‌ను తిరిగి పూర్తిగా తెరిస్తే.. కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగించేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు.


2025 జూన్‌ నెలలో జరిగిన 'ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్' దాడి వల్ల ఇరాన్ అణు మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయని, దాని కారణంగా ఇరాన్ అణ్వాయుధ తయారీని ఇప్పట్లో మొదలుపెట్టలేదని ట్రంప్ తన సీనియర్ సహాయకులతో చెప్పారు. ఇరాన్ ఆర్థికంగా, సైనికపరంగా ఎక్కువ కాలం నిలబడలేదని, ఈ యుద్ధం చాలా త్వరగా ముగిసిపోతుందని వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా తన సైనిక లక్ష్యాలన్నింటినీ ఇప్పటికే పూర్తి చేసిందని ఆయన భావిస్తున్నారు.


అణు ఒప్పందం లేకుండానే యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ భావిస్తున్నా.. అమెరికా విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ కఠినమైన షరతులు విధిస్తుండటంతో యుద్ధానికి పులుస్టాప్ పెట్టడం ట్రంప్‌‌నకు సవాలుగా మారింది. హోర్ముజ్ విషయంలోనూ ట్రంప్‌నకు చుక్కెదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

లిఖిత రూపాల నిరంకుశత్వం

గత వారం అంతా ధరల్లో పెరుగుదల.. ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 10 , 2026 | 07:44 AM