Share News

అతి త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుంది: ట్రంప్

ABN , Publish Date - Aug 07 , 2026 | 09:33 AM

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో యుద్ధం ముగియబోతోందని ప్రకటించారు. ఇరాన్ చర్చల కోసం తమను సంప్రదిస్తుందని, హోర్ముజ్ జలసంధి పూర్తి స్థాయిలో తిరిగి తెరుచుకుంటుందని అన్నారు.

అతి త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుంది: ట్రంప్
Trump Iran War

న్యూయార్క్, ఆగస్టు 7: ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో యుద్ధం ముగియబోతోందని ప్రకటించారు. ఇరాన్ చర్చల కోసం తమను సంప్రదిస్తుందని, హోర్ముజ్ జలసంధి పూర్తి స్థాయిలో తిరిగి తెరుచుకుంటుందని అన్నారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ‘నేను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో చర్చలు ప్రారంభించాను. అవి చాలా ముఖ్యమైన చర్చలు. ఎందుకంటే ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండటానికి వీలులేదు. ఈ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని భావిస్తున్నాను. వారు ఎక్కువ కాలం యుద్ధాన్ని కొనసాగించలేరని అనుకుంటున్నాను’ అని అన్నారు.


ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికా వద్ద దీర్ఘశ్రేణి క్షిపణులు, వైమానిక రక్షణ వ్యవస్థలకు సంబంధించిన నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘మా వద్ద కొన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి. అవి చాలా శక్తివంతమైనవి. వాటి నిల్వలు మా దగ్గర అపరిమితంగా ఉన్నాయి. అయితే, మరికొన్ని రకాల ఆయుధాల విషయంలో మాత్రం నిల్వలు కొద్దిగా తక్కువగా ఉన్నాయి’ అని అన్నారు.


ఆయుధ నిల్వల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం. తరిగిపోతున్న ఆయుధ నిల్వలపై తనకు పూర్తి సమాచారం ఎందుకు ఇవ్వలేదని హెగ్సెత్‌పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి.


ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో తప్పని నీళ్ల సర్దుబాటు

దేశంలో నేతన్నల కుటుంబాలకు మద్దతు ఇవ్వాలి: ప్రజలకు మోదీ పిలుపు

Updated Date - Aug 07 , 2026 | 09:53 AM