ట్రంప్‌నకు దెబ్బ.. కౌంటర్ టెర్రరిజం చీఫ్ రాజీనామా
ABN , Publish Date - Mar 17 , 2026 | 08:41 PM
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ స్టేట్స్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ చీఫ్ జెసెఫ్ కెంట్ తన పదవికి రాజీనామా చేశారు.
వాషింగ్టన్: ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ స్టేట్స్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్(NCTC) చీఫ్ జోసెఫ్ కెంట్(Joseph Kent) తన పదవికి రాజీనామా చేశారు. అమెరికాకు ఇప్పటికిప్పుడు ఇరాన్ వల్ల వచ్చే ముప్పేది లేదని ఆయన తన రాజీనామా లేఖలో తెలిపారు. ఇజ్రాయెల్ తీసుకువచ్చిన ఒత్తిడి కారణంగానే యుద్ధానికి దిగాలని డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
'ఎంతో ఆలోచించిన తరువాతే ఎన్‍సీటీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు నుంచి నా రాజీనామా అమల్లోకి వచ్చింది' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో జోసెఫ్ కెంట్ తెలిపారు. ఇరాన్‌తో యుద్ధాన్ని తాను మనస్సాక్షిగా మద్దతు ఇవ్వలేనని, అయితే ఇరాన్ వల్ల తక్షణం అమెరికాకు వచ్చే నష్టం ఏమీ లేదని చెప్పారు. అయితే ఒక మాట మాత్రం తాను స్పష్టంగా చెప్పగలని.. ఇజ్రాయెల్, దాని శక్తిమంతమైన అమెరికా లాబీ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే తాము(అమెరికా) యుద్ధం ప్రారంభించామని అన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రతీకారమే.. మధ్యవర్తి దేశాలకు తేల్చిచెప్పిన మొజ్తాబా
ఇరాన్ సెక్యూరిటీ చీఫ్‌ను చంపేశాం.. ఇజ్రాయెల్ ప్రకటన