ప్రజలను చంపాలనుకోవటం లేదు.. ఇరాన్‌తో చర్చలపై ట్రంప్..
ABN , Publish Date - Aug 03 , 2026 | 10:52 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలపై క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు (సోమవారం) నుంచే ఇరాన్‌తో అమెరికా చర్చలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అన్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలపై క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు (సోమవారం) నుంచే ఇరాన్‌తో అమెరికా చర్చలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అన్నారు. తాను ప్రజలను చంపాలనుకోవటం లేదని తేల్చి చెప్పారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..
‘ఇరాన్‌తో సోమవారం మధ్యాహ్నం నుంచి చర్చలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ చర్చలు ఎలా సాగుతాయో వేచి చూడాలి. నేను ప్రజలను చంపాలనుకోవట్లేదు. ఎందుకంటే సైనిక దాడుల వల్ల చాలా మంది చనిపోతారు. అది నాకు ఇష్టం లేదు’ అని స్పష్టం చేశారు.
ఇరాన్‌పై దాడి తాత్కాలికంగా నిలిపివేత
గత వారం ఇరాన్‌పై జరపాలనుకున్న అత్యంత భారీ సంయుక్త సైనిక దాడులను అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తాత్కాలికంగా నిలిపివేశాయి. యుద్ధాన్ని ముగించేందుకు ఇరుపక్షాల మధ్య ఒక ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్, కొన్ని మధ్యప్రాచ్య దేశాల ప్రత్యేక అభ్యర్థన మేరకు తాము ఈ దాడులను వాయిదా వేసినట్లు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ఆదివారం వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
శ్రీలంకతో టెస్టు సిరీస్: బుమ్రా ఔట్.. ఆకిబ్ నబీకి ఛాన్స్
తన విమానంలో తొలి ప్రయాణికురాలిగా తల్లి.. కొడుకు భావోద్వేగ క్షణాలు