Share News

తన విమానంలో తొలి ప్రయాణికురాలిగా తల్లి.. కొడుకు భావోద్వేగ క్షణాలు

ABN , Publish Date - Aug 03 , 2026 | 10:11 AM

ఎయిర్ఇండియా పైలట్ తనీష్ అరోరా జీవితంలో ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన కల సాకారమైంది. తాను నడిపే విమానంలో తొలిసారిగా తన తల్లిని ప్రయాణించడం.. ఆ భావోద్వేగ క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుని అందరినీ కదిలించాడు.

తన విమానంలో తొలి ప్రయాణికురాలిగా తల్లి.. కొడుకు భావోద్వేగ క్షణాలు
Air India Pilot

ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్ఇండియాలో పైలట్‌గా విధులు నిర్వహిస్తున్న ఢిల్లీకి చెందిన తనీష్ అరోరాకు తన జీవితంలో కన్న కల నిజమైంది. పైలట్‌గా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి తాను నడిపే విమానంలో తన తల్లిని ఒక్కసారైనా తీసుకెళ్లాలన్న ఆయన ఆశ ఎట్టకేలకు నెరవేరింది. ఆ రోజును ఉదయం యూనిఫామ్ ధరించడం నుంచి విమానాశ్రయానికి తల్లితో కలిసి వెళ్లడం వరకు ప్రతి క్షణాన్ని వీడియోగా చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో తన కొడుకు నడిపే విమానంలో ప్రయాణించబోతున్నందుకు ఎలా అనిపిస్తోందని తనీష్ తల్లిని అడగగా.. ఆమె ‘చాలా ఉత్సాహంగా ఉంది’ అంటూ చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. విమానాశ్రయంలో ఇద్దరూ కలిసి గడిపిన క్షణాలు.. బోర్డింగ్ గేట్ వరకు కలిసి నడిచిన దృశ్యాలు వీడియోలో హృదయాలను హత్తుకున్నాయి.


ఈ ప్రయాణం తనీష్‌కు ఒక విమాన ప్రయాణం మాత్రమే కాదు, జీవితంలో మరచిపోలేని అనుభూతిగా నిలిచిపోయింది. చిన్నప్పుడు తనకు నడక నేర్పిన తల్లినే ఇప్పుడు తాను ఆకాశంలో సురక్షితంగా తీసుకెళ్లడం ఎంతో గర్వంగా ఉందని తెలిపాడు. ‘నాకు మొదటి అడుగులు వేయడం నేర్పిన మహిళను ఈ రోజు నేను ఆకాశంలోకి తీసుకెళ్లాను. ఆమె ఎప్పటికీ నా అత్యంత ఇష్టమైన ప్రయాణికురాలు’ అంటూ చేసిన పోస్ట్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటూ ప్రశంసలు అందుకుంటోంది.


ఇవి కూడా చదవండి

టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా సుభదీప్ ఘోష్ నియామకం

కోర్టుల్లో విచారణకు నోచని ‘పరీక్షల్లో అక్రమాల’ కేసులు..158

Updated Date - Aug 03 , 2026 | 10:24 AM