Share News

కోర్టుల్లో విచారణకు నోచని ‘పరీక్షల్లో అక్రమాల’ కేసులు..158

ABN , Publish Date - Aug 03 , 2026 | 06:43 AM

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నియామక పరీక్షల అక్రమాలకు సంబంధించిన సుమారు 158 కేసులు కోర్టుల్లో అసలు విచారణకు నోచుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయా కేసుల్లో...

కోర్టుల్లో విచారణకు నోచని ‘పరీక్షల్లో అక్రమాల’ కేసులు..158

న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నియామక పరీక్షల అక్రమాలకు సంబంధించిన సుమారు 158 కేసులు కోర్టుల్లో అసలు విచారణకు నోచుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయా కేసుల్లో సీబీఐ దర్యాప్తు పూర్తయినప్పటికీ.. దేశంలోని వివిధ కోర్టుల్లో విచారణ ప్రారంభం కోసం ఇంకా వేచి చూస్తునే ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ కేసుల్లో కొన్ని రెండు దశాబ్దాలకు పైగా క్రితం నమోదైనవి కూడా ఉండడం గమనార్హం. ఆయా పెండింగ్‌ కేసులను కొత్త పబ్లిక్‌ పరీక్షల చట్టం ప్రకారం ఏర్పాటు చేయనున్న ఫాస్‌ట్రాక్‌ కోర్టులను బదిలీ చేసేలా అన్ని హైకోర్టులను ఆశ్రయించాలని సీబీఐ నిర్ణయించిందని ఆ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో కోర్టుల్లో విచారణ కోసం వేచిచూస్తున్న 2000నాటి నుంచి నమోదైన దాదాపు 25 కేసుల వరకు ఉన్నాయి. బిహార్‌లో నీట్‌-2024 పేపర్‌ లీక్‌ ఆరోపణలకు సంబంధించి మూడు కేసులు సహా మొత్తం ఐదు పెండింగ్‌ కేసులు ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో కోర్టుల్లో నానుతున్న మూడు కేసుల్లో 2022 నాటి కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ కేసు ఒకటి. జమ్ముకశ్మీర్‌లో 3, ఝార్ఖండ్‌లో 5, కర్ణాటకలో 5, మహారాష్ట్రలో 3, రాజస్థాన్‌లో 8, తమిళనాడులో 14, యూపీ, పశ్చిమబెంగాల్‌లలో 10 చొప్పున పెండింగ్‌ కేసులు ఉన్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..

వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..

Updated Date - Aug 03 , 2026 | 07:36 AM