Share News

ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయబోము: డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Sep 22 , 2026 | 10:06 PM

ఏఐ అభివృద్ధిని తమ ప్రభుత్వం అడ్డుకోదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఏఐలో ముందున్న వారే అంతిమ విజేతలుగా నిలుస్తారని స్పష్టం చేశారు.

ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయబోము: డొనాల్డ్ ట్రంప్
Donald Trump on AI

ఇంటర్నెట్ డెస్క్: ఏఐ అభివృద్ధిని తమ ప్రభుత్వం అడ్డుకోదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఏఐలో ముందున్న వారే అంతిమ విజేతలుగా నిలుస్తారని స్పష్టం చేశారు. పారిశ్రామిక విప్లవం కంటే ఏఐ విప్లవం మరింత ప్రభావశీలమైనదని అన్నారు. ప్రస్తుతం తాము చైనాకంటే ముందున్నామని కూడా చెప్పారు. ఈ స్థానాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఇకపై సూపర్ ఇంటెలిజెన్స్ అని పిలవాలని కూడా ట్రంప్ అభిప్రాయపడ్డారు. తాము అదే పదాన్ని ఇకపై వినియోగిస్తామని చెప్పారు. ఈ పదం వినడానికి బాగుంటుందని కూడా అన్నారు.


మునుపటి పారిశ్రామిక విప్లవాలు, ఇంటర్నెట్‌తో పోలిస్తే మరింత పెద్ద మార్పులు రాబోతున్నాయని అన్నారు. అయితే, ఈ విషయంలో తాము జాగ్రత్తతో వ్యవహరిస్తామని కూడా అన్నారు. ఏఐ సామర్థ్యాలపై వ్యక్తమవుతున్న ఆందోళనను కూడా ట్రంప్ తోసిపుచ్చారు.

గత వారం కూడా ట్రంప్ ఓ సమావేశంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఏఐ, రోబోలు ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోలేవని తేల్చి చెప్పారు. అవన్నీ అర్థరహిత భయాలని అన్నారు. అయితే, ఈ వ్యవహారంలో పరిశ్రమ వర్గాలు జాగ్రత్తగా ముందుకు సాగాలని అన్నారు. ఏఐ అభివృద్ధికి కీలకమైన డేటా సెంటర్ల విస్తరణ జరగాలని కూడా ట్రంప్ స్పష్టం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్‌ను ఒంటరిని చేయాలి.. యూఎన్‌లో ట్రంప్ ప్రసంగం

భారత్‌కు శిక్ష వద్దు.. అమెరికాకు జేపీ మోర్గన్ ఛేజ్ సీఈఓ సూచన

Updated Date - Sep 22 , 2026 | 10:11 PM