Share News

ప్రత్యేక బలగాలు, డజన్ల కొద్దీ విమానాలు.. ఎఫ్-25 పైలట్‌ను రక్షించిన యూఎస్

ABN , Publish Date - Apr 05 , 2026 | 05:49 PM

శత్రు భూభాగంలో తమ ఎయిర్‌మెన్ చిక్కుకుపోయినప్పుడు యూఎస్ సాహసోపేతమైన ఆపరేషన్‌ను నిర్వహించి అతన్ని రక్షించింది. దేశ చరిత్రలోనే తొలిసారి శత్రు భూభాగంలోకి వెళ్లి అత్యంత సాహసోపేతమైన ఈ ఈపరేషన్‌ను తమ సైన్యం సమర్ధవంతంగా నిర్వహించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

ప్రత్యేక బలగాలు, డజన్ల కొద్దీ విమానాలు.. ఎఫ్-25 పైలట్‌ను రక్షించిన యూఎస్
US foeces

వాషింగ్టన్: శత్రు భూభాగంలో తమ ఎయిర్‌మెన్ చిక్కుకుపోయినప్పుడు యూఎస్ సాహసోపేతమైన ఆపరేషన్‌ను నిర్వహించి అతన్ని రక్షించింది. దేశ చరిత్రలోనే తొలిసారి శత్రు భూభాగంలోకి వెళ్లి అత్యంత సాహసోపేతమైన ఈ ఈపరేషన్‌ను తమ సైన్యం విజయవంతంగా నిర్వహించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తికాగానే 'ఉయ్ గాట్ హిమ్' అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఆయుధాలు, డజన్ల కొద్దీ యుద్ధ విమానాలతో అమెరికా దళాలు గాలింపు చేపట్టి పైలట్‌ను కాపాడినట్టు తెలిపారు. అమెరికా బలగాల ఆధీనంలోనే ఎయిర్‌మెన్ సురక్షితంగా ఉన్నట్టు వెల్లడించారు.


ఆపరేషన్ జరిగిందిలా..

రెండు సీటర్ల అమెరికా యుద్ధ విమానం ఎఫ్-15E స్ట్రైక్ ఈగిల్‌ ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో గత శుక్రవారం కూలిపోయింది. పైలట్ ప్రమాదం నుంచి బయటపడగా, విమానంలోని వెపన్ సిస్టమ్ ఆధికారి జాడ గల్లంతైంది. ఇది జరిగిన రెండ్రోజుల్లో ట్రంప్ ఆదేశాలతో మిలటరీ డజన్ల కొద్దీ విమానాలు, సాయుధ బలగాలతో గాలింపు చర్యలు జరిపి ఎట్టకేలకు అతన్ని కాపాడింది. ఈ స్పెషల్ రెస్క్యూ ఆపరేషన్‌లో వందలాది సైనికులు పాల్గొన్నట్టు అధికారులను ఉటంకిస్తూ జజీరా వార్తాసంస్థ తెలిపింది. ఇరాన్‌లోని ప్రమాదకరమైన పర్యతాల్లో ఎయిర్‌మెన్‌ను గుర్తించి సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చినట్టు పేర్కొంది. అర్ధరాత్రి చీకట్లో మొదలైన ఆపరేషన్ తెల్లారి ముగిసినట్టు తెలిపింది. మధ్యలో కాల్పులు చోటుచేసుకున్నప్పటికీ ఎయిర్‌మెన్‌ను అమెరికా మిలటరీ సురక్షితంగా వెనక్తి తెచ్చినట్టు చెప్పింది. ఎయిర్‌మన్ తలదాచుకున్న ప్రదేశాన్ని ఇరాన్ బలగాలు గుర్తించకుండా యూఎస్ విమానాలు బాంబులు జారవిడుస్తూ, కాల్పులు జరుపుతూ ఆపరేషన్ నిర్వహించింది. రెండ్రోజులుగా ఈ ఆపరేషన్ సాగిస్తూ వచ్చింది. శుక్రవారంనాడు విమానం కుప్పకూలడంతో బయటపడినప్పటి నుంచి ఎఫ్-15 పైలట్, వెపన్స్ సిస్టమ్ అధికారి తమ కమ్యూనికేషన్ సిస్టంల ద్వారా సంప్రదింపులు సాగించినట్టు యాక్సియోస్ ఒక కథనంలో పేర్కొంది. అమెరికా రెస్క్యూ ఆపరేషన్‌లో వాయిసేనకు చెందిన బ్లాక్ హాక్ హెలిక్టాపర్‌పై ఇరాన్ దాడి జరిపిందని, సిబ్బంది గాయపడినప్పటికీ ముందుకు ఎగురుతూ వెళ్లిపోయిందని, వెపన్స్ సిస్టమ్ అధికారి ఉన్న లొకేషన్‌ను గుర్తించి, కాపాడేందుకు ఒకరోజు పైనే పట్టిందని తెలిపింది. దీనికి ముందు అతనిని గాలించేందుకు సీఐఏ తన శక్తిసామర్థ్యాలను ఉపయోగించి లొకేషన్ కనుకొంది. దానిని వైట్‌హైస్, యూఎస్ మిలటీరీకి షేర్ చేసింది, దీంతో పెంటగాన్ శనివారం రాత్రి రెస్స్యూ ఆపేరేషన్ విజయవంతంగా నిర్వహించింది. అమెరికా సైన్యం మరో సాహస పైలట్‌ను సురక్షితంగా కాపాడిందని, తమ రక్షణ చర్యలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే దీనిని ఇంతవరకూ బహిర్గతం చేయలేదని ట్రంప్ ప్రకటించారు. ఏ ఒక్క అమెరికన్ యోధుడిని తాము ఒంటరిగా వదిలిపెట్టేది లేదని. ఇది అమెరికన్ ప్రజలు, రిపబ్లికన్లు, డెమోక్రాట్లు, ప్రతి ఒక్కరి గర్వించదగిన సందర్భమని అన్నారు.


రెస్కూ ఆపరేషన్ అద్భుతం

తమ బలగాలు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ 'అద్భుతం' అని ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఇరాన్ క్షిపణులు, రాడార్ సిస్టమ్‌ను కూడా ఖాతరు చేయకుండా ఇరాన్‌లోని పర్యత ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ జరిపినట్టు చెప్పారు. ఈ ఆపరేషన్ కోసం హెచ్‌హెచ్-60 డబ్లూ 'జాలీ గ్రీన్ 2' రెస్క్యూ హెలికాప్టర్లు, ఎ-10 వార్‌హాగ్ అటాక్ జెట్, హెచ్‌సీ-130 రెస్యూ మిడ్-ఎయిర్ ట్యాంకర్, ఎఫ్-35 స్టెల్త్ జెట్‍లను అమెరికా రంగంలోకి దింపింది. హెచ్‌హెచ్-60 డబ్ల్యూ జాలీ గ్రీన్ 2 అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన అత్యంత పోరాటపటిమ కలిగిన గాలింపు, రెస్యూ హెలికాఫ్టర్. కాలం చెల్లిన హెచ్‌హెచ్-60జీ పేవ్ హాక్‌ స్థానంలో ఈ హెలికాఫ్టర్‌ని అమెరికా తీసుకువచ్చింది.


ఇవి కూడా చదవండి..

యూఎస్ సైన్యం కదలికలపై చైనా కంపెనీల నిఘా

హోర్ముజ్‌ను దాటిన మరో నౌక.. భారత్ వైపు సేఫ్‌గా జర్నీ

Updated Date - Apr 05 , 2026 | 05:57 PM