Share News

వాళ్లు చాలా క్లోజ్.. ఎన్విడియా సీఈఓ ఎఫైర్‌పై 6 నెలల క్రితమే డౌట్

ABN , Publish Date - Nov 09 , 2026 | 03:07 PM

ఎన్విడియా సీఈఓ జెన్సన్, ఆలిస్‌ల అసాధారణ సాన్నిహిత్యం గురించి ఆరు నెలల క్రితమే ఓ షార్ట్ సెల్లర్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఆలిస్‌తో ఎన్విడియో సీఈఓ ఎఫైర్ నేపథ్యంలో ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది.

వాళ్లు చాలా క్లోజ్..  ఎన్విడియా సీఈఓ ఎఫైర్‌పై 6 నెలల క్రితమే డౌట్
Short seller's report on Jensen Alice Closeness

ఇంటర్నెట్ డెస్క్: మైక్రోచిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్.. ఆలిస్ అనే మహిళతో రోమాంటిక్ బంధంలో ఉన్నారన్న విషయం ప్రస్తుతం అమెరికాలో కలకలం రేపుతోంది. ఆమె చైనా గూఢచారిణి అన్న వార్తలు వెలువడ్డ మరుసటి రోజే వారి బంధం బయటపడటం కలకలానికి దారి తీసింది. అయితే, వారి తీరు అనుమానాస్పదంగా ఉందన్న విషయం ఆరు నెలల క్రితమే వెలుగులోకి వచ్చింది. యూఎస్ షార్ట్ సెల్లర్ కుల్పర్ రీసెర్చ్ సంస్థ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వారి మధ్య ఎఫైర్ ఉన్నట్టు సంస్థ నేరుగా ప్రకటించనప్పటికీ ఆ ఇద్దరూ మరీ క్లోజ్‌గా ఉన్నట్టు తన నివేదికలో పేర్కొంది.


చైనా గూఢచారిణిగా అమెరికా మీడియా చెబుతున్న ఆలిస్ హువాంగ్ సింగ్‌పూర్‌ సంస్థ మెగాస్పీడ్‌లో ఉన్నతాధికారిగా ఉన్నారు. చైనా కంపెనీల కోసం అమెరికా సంస్థల నుంచి మెగా స్పీడ్ అత్యాధునిక కంప్యూటర్ చిప్స్‌ను కొనుగోలు చేసేంది. వీటి అలీబాబా లాంటి సంస్థలకు కూడా మెగాస్పీడ్ సరఫరా చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. ఎన్విడియా కంపెనీ షేర్ల షార్టింగ్‌కు కుల్పర్ రీసెర్చ్ సంస్థ సిద్ధమవుతున్న తరుణంలోనే నివేదిక కూడా బయట పడింది. ఓ సంస్థ షేర్లు పతనమవుతాయన్న అంచనాతో వాటితో స్టాక్ మార్కెట్ డీలింగ్స్ నిర్వహించడాన్ని షార్టింగ్ అంటారన్న విషయం తెలిసిందే.


ఇక తన అనుమానాలకు బలం చేకూర్చేలా కుల్పర్ రీసెర్చ్ రెండు ఉదంతాలను కూడా ప్రస్తావించింది. 2024లో వారిద్దరూ తైవాన్‌లో ఓ సమావేశానికి హాజరైన విషయాన్ని పేర్కొంది. ఆ మరుసటి చైనాపై అమెరికా ఆంక్షలు విధించిన తరువాతకూడా వారు హాంకాంగ్‌లో కనిపించారని చెప్పింది. ఆ సమయంలో బహిరంగంగా జెన్సన్‌తో కనిపించేందుకు ఆలిస్ విముఖత వ్యక్తం చేసినట్టు కూడా కుల్పర్ తన నివేదికలో పేర్కొంది. వారు అసాధారణ రీతిలో సన్నిహితంగా కనిపించారని పేర్కొంది. ఇటీవలే వారి ఎఫైర్ గురించి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఎగుమతులపై ఆంక్షలు సడలింపు విషయంలో జెన్సన్ చైనా పక్షాన నిలిచేలా చూడాల్సిన బాధ్యత ఆలిస్‌కు అప్పగించినట్టు కథనాలు వెలువడ్డాయి.


తన చుట్టూ మారుతున్న పరిణామాల గురించి జెన్సన్‌‌కు తెలుసా లేదా అన్న విషయాలపై మాత్రం స్పష్టత లేదు. ఆలిస్ తమ గూఢచారిణి అన్న వార్తలనూ చైనా తోసిపుచ్చింది. అయితే, ఆలిస్ తమ సంస్థను వీడిగా ఇంకా తమ బాస్‌గానే ఉంటోందని మెగాస్పీడ్ సంస్థ ఉద్యోగిక ఒకరు కుల్పర్‌కు తెలిపారు. జెన్సర్ తరచూ తమ సంస్థ డేటా సెంటర్స్‌కు వస్తుండేవారని కూడా అన్నారు. ఆ సమయంలో అలీబాబా సంస్థ ప్రతినిధులు కూడా వచ్చేవారి తెలిపారు.


2026 ఆర్థిక సంవత్సరంలో ఎన్విడియా ఆదాయంలో 20 శాతం చైనా నుంచే వచ్చిందని కుల్పర్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఆగ్నేయాసియా మీదుగా ఎన్విడియా ఉత్పత్తులు అక్రమంగా చేరేవని కుల్పర్ తన నివేదికలో చెప్పింది. కుల్పర్ నివేదిక ఆరు నెలల క్రితం వెలుగులోకి వచ్చింది. అంతకుముందు నుంచే అమెరికా నిఘా సంస్థలు వారి బంధంపై దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. ఏడాది క్రితమే తొలిసారిగా ఈ విషయాన్ని అమెరికా నిఘా సంస్థలు అధ్యక్షుడు ట్రంప్‌ చెవిన వేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తమ మధ్య వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని జెన్సన్ హువాంగ్ తాజాగా అంగీకరించారు. భార్య, పిల్లలకు క్షమాపణ కూడా చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

ఎవరీ ఆలిస్ హువాంగ్? ఎన్విడియా సీఈఓతో సంబంధాలేంటి.?

ఇరాన్‌పై మళ్లీ యుద్ధం.. అత్యంత అసంభవం: ట్రంప్

Updated Date - Nov 09 , 2026 | 05:33 PM