Share News

ఎన్విడియా సీఈఓగా పునర్నియామకం.. జెన్సన్ హువాంగ్ స్పందన ఏంటంటే..

ABN , Publish Date - Nov 23 , 2026 | 08:52 PM

ప్రపంచ ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా (NVIDIA)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ తిరిగి తన బాధ్యతలను చేపట్టనున్నారు.

ఎన్విడియా సీఈఓగా పునర్నియామకం..  జెన్సన్ హువాంగ్ స్పందన ఏంటంటే..
Jensen Huang

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా (NVIDIA)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ తిరిగి తన బాధ్యతలను చేపట్టనున్నారు. ఆయన రాజీనామా చేసిన 11 రోజులకే డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా తిరిగి నియమించింది. ఈ పరిణామంపై స్పందించిన హువాంగ్.. మళ్లీ సంస్థకు నాయకత్వం వహించే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నానని, పని ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు (Jensen Huang Reinstated).


1993లో ఎన్విడియాను స్థాపించిన జెన్సన్ హువాంగ్ నవంబరు 12న కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ పదవులకు రాజీనామా చేశారు. చైనా గూఢచారిగా భావిస్తున్న మహిళతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఆయన తన పదవులకు రాజీనామా చేశారు. ఎన్విడియా కంపెనీ బోర్డు ఆయన రాజీనామాను అంగీకరించింది. తాత్కాలిక సీఈఓగా సంస్థ ఆర్థిక విభాగం అధిపతి కొలెట్ క్రెస్ బాధ్యతలు చేపట్టారు. తాజాగా హువాంగ్‌తో వరుసగా చర్చలు జరిపిన ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు ఆయనను తిరిగి నియమించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ముందు అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది (Jensen Huang Nvidia CEO).


హువాంగ్ నాయకత్వ సామర్థ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని బోర్డు ఛైర్మన్ హార్వీ జోన్స్ తెలిపారు (Chinese Spy Scandal). ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టడం వాటాదారులు, ఉద్యోగులు, భాగస్వాములు, వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. తిరిగి సీఈఓగా నియమితులైన తర్వాత జెన్సన్ హువాంగ్ స్పందించారు. ప్రపంచంలోని అత్యంత కీలక సాంకేతిక సంస్థల్లో ఒకటైన ఎన్విడియాకు తిరిగి నాయకత్వం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. తనపై విశ్వాసం ఉంచిన డైరెక్టర్ల బోర్డుకు కృతజ్ఞతలు చెప్పారు. మళ్లీ పని ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నాని వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

స్టాక్ మార్కెట్ క్రాష్.. ఒక్కరోజే రూ.5 లక్షల కోట్లకు పైగా ఆవిరి..


గోద్రా రైలు దహనం కేసు.. 17 ఏళ్ల తర్వాత దోషికి బెయిల్..

Updated Date - Nov 23 , 2026 | 08:55 PM