Share News

అమెరికాకు దెబ్బ మీద దెబ్బ.. యూఎస్ ఎమ్‌క్యూ -1 డ్రోన్‌ను కూల్చేసిన ఇరాన్..

ABN , Publish Date - Apr 04 , 2026 | 01:49 PM

అమెరికాకు చెందిన ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను ఇరాన్ కూల్చేసింది. ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సాయంతో ఐఆర్‌జీసీ కూల్చేసిందని ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

అమెరికాకు దెబ్బ మీద దెబ్బ.. యూఎస్ ఎమ్‌క్యూ -1 డ్రోన్‌ను కూల్చేసిన ఇరాన్..
Iran war live updates

టెహ్రాన్, ఏప్రిల్ 4: ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం మరింత పెరుగుతోందే కానీ, తగ్గటం లేదు. ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్‌పై విరుచుకుపడుతున్నాయి. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసే విధంగా దాడులు చేస్తున్నాయి. ఇరాన్‌ ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు. రెండు దేశాలకు గట్టిపోటీ ఇస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఆ దేశాల దాడులను సమర్థవంతంగా అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన రెండు ఫైటర్ జెట్‌లను శుక్రవారం కూల్చేసింది.


అమెరికాకు చెందిన అమెరికన్ ఏ -10 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసింది. శుక్రవారం స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర అమెరికన్ ఏ-10 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసిందని తస్‌నిమ్ న్యూస్ ఎజెన్సీ తెలిపింది. అమెరికన్ ఏ -10తో పాటు ఎఫ్15-ఈ స్టెక్‌ ఈగిల్‌ యుద్ధ విమానాన్ని కూడా ఇరాన్‌ కూల్చేసింది. తాజాగా, అమెరికాకు చెందిన ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను ఇరాన్ కూల్చేసింది. ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సాయంతో ఐఆర్‌జీసీ కూల్చేసిందని ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.


ఇవి కూడా చదవండి

6న అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

ఆర్సీబీలో ఐదో విదేశీ ప్లేయర్.. విరాట్ కోహ్లీ స్పందన ఏంటంటే..

Updated Date - Apr 04 , 2026 | 02:33 PM