ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ కీలక ప్రకటన
ABN , Publish Date - Mar 03 , 2026 | 09:01 PM
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియన్ తాజాగా కీలక ప్రకటన చేసారు. యుద్ధం కొనసాగుతున్నా ఇరాన్ ప్రభుత్వ యంత్రాంగ అద్భుతంగా పనిచేస్తోందన్నారు.
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండగా, గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలు, అమెరికా రాయబార కార్యాలయాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేస్తోంది. అమెరికా అధ్యక్ష భవనంపై దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియన్ తాజాగా కీలక ప్రకటన చేసారు. యుద్ధం కొనసాగుతున్నా ఇరాన్ ప్రభుత్వ యంత్రాంగ అద్భుతంగా పనిచేస్తోందన్నారు.
'యుద్ధ పరిస్థితుల్లోనూ దేశం ధైర్యంగా నిలిచింది. యుద్ధం జరుగుతున్నా పరిపాలనపై పట్టు సడలలేదు. ప్రభుత్వ యంత్రాంగం అద్భుతంగా పనిచేస్తోంది. ప్రావిన్స్ గవర్నర్లతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి' అని మసూద్ పెజిష్కియన్ తెలిపారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడులను తిప్పికొడతామని, ప్రతిదాడులను కొనసాగిస్తామని చెప్పారు.
ఇరాన్ వద్ద 11 న్యూక్లియర్ బాంబులను తయారుచేసే యురేనియం
కాగా, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడికి దిగడానికి ప్రధాన కారణం ఏమిటనేది అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. యురేనియం సుసంపన్నం (Enriched uranimum) చేసే హక్కును తాము విడిచిపెట్టేది లేదని ఇరాన్ మొండికేసిందని చెప్పారు. ఆ తర్వాతే ఆదేశంపై దాడి మొదలైందన్నారు. ఇరాన్ రహస్యంగా 460 కిలోల సుసంపన్నం చేసిన యురేనియంను నిల్వ చేసిందని, దీంతో 11 అణుబాంబులు తయారు చేయవచ్చని ఆయన తెలిపారు. హిజ్బొల్లా వంటి మిలటరీ గ్రూప్‌లకు సపోర్ట్ చేస్తామంటూనే... తమ అణు, బాలిస్టిక్ క్షిపణి ప్రోగ్రాంలను కొనసాగిస్తామని ఇరాన్ తేల్చిచెప్పడం వల్లే జెనీవాలో జరిగిన చర్చలు విఫలమయ్యాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్
ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి