Share News

ఇరాన్ ప్రాధేయపడింది.. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సక్సెస్: అమెరికా రక్షణ మంత్రి

ABN , Publish Date - Apr 08 , 2026 | 08:21 PM

ఇరాన్‌పై చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' విజయవంతమైందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. కాల్పుల విరమణకు ఇరాన్ ప్రాథేయపడటంతో ట్రంప్ దయ చూపించారని చెప్పారు.

ఇరాన్ ప్రాధేయపడింది.. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సక్సెస్: అమెరికా రక్షణ మంత్రి
Pete Hegseth

వాషింగ్టన్: ఇరాన్‌పై చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' (Operation Epic Fury) విజయవంతమైందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) ప్రకటించారు. రెండు వారాల కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకరించిన అనంతరం వైట్‌హౌస్‌లో బుధవారంనాడు నిర్వహించిన మీడియా సమావేశంలో హెగ్సెత్ మాట్లాడుతూ, కాల్పుల విరమణకు ఇరాన్ ప్రాథేయపడటంతో ట్రంప్ దయ చూపించారని చెప్పారు.


'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఒక చరిత్రాత్మకమైన, అద్భుత విజయం. ఇరాన్ మిలటరీని నామరూపాలు లేకుండా చేసింది. రానున్న కాలంలో ఇరాన్ యుద్ధ సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయింది. ఇకపై క్షిపణులు డ్రోన్లు వంటి ఏ ఆయధాలు తయారు చేయలేదు' అని హెగ్సెత్ తెలిపారు. అమెరికా సైన్యం గంటల వ్యవధిలోనే వందలాది దాడులు జరిపిందని, ఒక్క మంగళవారం రాత్రే 800 దాడులు జరిపామని, ఇరాన్ రక్షణ పారిశ్రామిక స్థావరాలు, ఫ్యాక్టరీలు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఇరాన్ సుప్రీం నేత (మొజ్తాబా ఖమేనీ) గాయపడ్డారని, రూపురేఖలు లేకుండా అయ్యారని హెగ్సెత్ తెలిపారు. అయితే ఇందుకు ఎలాంటి ఆధారాలను ఆయన ప్రస్తావించలేదు.


ట్రంప్ తలుచుకుంటే..

ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కకావికలు చేసే శక్తి ట్రంప్‌కు ఉందని, కానీ ఆయన దయ చూపారని హెగ్సెత్ చెప్పారు. తీవ్రమైన ఒత్తిడితో కాల్పుల విరమణకు ఇరాన్ ప్రాధేయపడిందన్నారు. తమకు ఎదురయ్యే దుర్భర పరిస్థితి కంటే ఒప్పందమే మేలని ఆ దేశ కొత్త ప్రభుత్వం గ్రహించిందని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

50 శాతం సుంకాలు విధిస్తాం.. ట్రంప్ తాజా హెచ్చరిక

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ.. తెర వెనుక చైనా..

Updated Date - Apr 08 , 2026 | 08:45 PM