Share News

పాకిస్థాన్‌తో భారత్ సమస్య భిన్నమైనది: అమెరికా విదేశాంగ మంత్రి

ABN , Publish Date - May 25 , 2026 | 11:18 AM

అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించడంపై భారత్‌కు ఎలాంటి అభ్యంతరమూ లేదని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రుబియో పేర్కొన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రుబియో.. భారత్, పాక్ సంబంధాల గురించి స్పందించారు.

పాకిస్థాన్‌తో భారత్ సమస్య భిన్నమైనది: అమెరికా విదేశాంగ మంత్రి
Marco Rubio

అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించడంపై భారత్‌కు ఎలాంటి అభ్యంతరమూ లేదని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రుబియో పేర్కొన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశంలో ఉన్న రుబియో మంగళవారం జరగబోయే క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన రుబియో.. భారత్, పాక్ సంబంధాల గురించి స్పందించారు (India Pakistan relations).


'భారత్‌కు పాకిస్థాన్ విషయంలో ఉన్న ప్రధాన ఆందోళనలు ఉగ్రవాద సంస్థల గురించే. వాటికి ఇరాన్ చర్చల్లో పాకిస్థాన్ పాత్రతో సంబంధం లేదు. పాక్ భూభాగం నుంచి పనిచేస్తూ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న సాయుధ ఉగ్రవాద బృందాల గురించే ఇండియన్లు ఎక్కువగా మాట్లాడతారు. వారు దాని గురించే ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ ఇరాన్ విషయంలో మధ్యవర్తిత్వం గురించి ప్రస్తావన రాలేదు. దాని గురించి వారు ఫిర్యాదు చేస్తారని నేను అనుకోను' అని రుబియో పేర్కొన్నారు (Pakistan Iran mediation).


భారతదేశం అమెరికాకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి అని, ప్రముఖ వాణిజ్య భాగస్వామి అని రుబియో అభివర్ణించారు (Rubio India visit). 'ఈ బంధం బలంగా కొనసాగుతుందని నేను భావిస్తున్నాను. ప్రస్తుత అమెరికా పరిపాలన ముగిసేనాటికి రెండు దేశాల మధ్య బంధం మునుపెన్నడూ లేనంత బలంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను' అని రుబియో అన్నారు.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

Updated Date - May 25 , 2026 | 11:21 AM