గాల్లోనే ఇంజిన్ ఫెయిల్.. సముద్రంలో విమానం దించిన యువ పైలట్!
ABN , Publish Date - Aug 24 , 2026 | 10:18 AM
అమెరికాలోని ఫ్లోరిడాలో 23 ఏళ్ల మహిళా పైలట్ ప్రదర్శించిన సాహసం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇంజిన్‌లో సమస్య కారణంగా భూమిపై దూసుకొస్తున్న చిన్న ఫ్లైట్‌ను చాకచక్యంగా తప్పించి.. సముద్రంలోకి మళ్లించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ యువ పైలట్ ప్రదర్శించిన సాహసం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంజన్‌లో సమస్య కారణంగా నేలపై కూలిపోతున్న చిన్న విమానాన్ని ఆమె ఎంతో చాకచక్యంగా సముద్రంలోకి మళ్లించి.. తనతో పాటు అనేక మంది ప్రాణాలను కాపాడారు. 'న్యూయార్క్ పోస్ట్' కథనం ప్రకారం.. 23 ఏళ్ల ఫెయిత్ టెన్‌క్లే అనే మహిళా పైలట్ తన కుటుంబానికి చెందిన సింగిల్ ఇంజిన్ 'పైపర్ PA30' విమానంలో ఫోర్ట్ మేయర్స్ నుంచి బహమాస్‌లోని తన తల్లిదండ్రులను పికప్ చేసుకోవడానికి బయలుదేరారు.
ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా విమానంలో ఇంజిన్ సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన ఆమె ఫ్లోరిడాలోని రద్దీగా ఉండే బోకా రాటన్ బీచ్ సమీపంలో అత్యవసర ల్యాండింగ్‌కు సిద్ధమయ్యారు. భవనాలను, బీచ్‌లో ఉన్న పర్యాటకులను తప్పిస్తూ చాకచక్యంగా విమానాన్ని అట్లాంటిక్ మహాసముద్రంలోకి దించారు. విమానంలో సముద్రంలోకి పడిపోవడం చూసి బీచ్‌లో ఉన్న సందర్శకులు షాక్ గురయ్యారు. ఆ తర్వాత ఆ యువ పైలట్ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
విమానం సముద్రంపై ల్యాండైన వెంటనే ఫైయిత్ ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరారు. క్షణాల వ్యవధిలో స్థానికులు, అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెకు సహాయం అందించారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో సదరు యువతికి ఎలాంటి గాయాలూ కాలేదని వైద్యులు నిర్ధారించారు. జనసమూహం ఉన్న బీచ్ ప్రాంతాన్ని తప్పించి... విమానాన్ని సముద్రం వైపు మళ్లించిన ఫెయిత్ సమయస్ఫూర్తిపై అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ఇవి కూడా చదవండి..
భర్తను చంపేసి పేగులను బయటకు తీసి.. హర్యానాలో ఓ మహిళ దారుణం..
స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..