Share News

ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారా.. విమానం దిగుతూ తడబడిన నేపథ్యంలో చర్చ..

ABN , Publish Date - Mar 22 , 2026 | 03:30 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారా? తాజాగా ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం నుంచి దిగుతున్న సమయంలో ట్రంప్‌ను చూసిన వారిలో ఈ సందేహం మొదలైంది. అంతకు ముందు రోజు జరిగిన ఓ కార్యక్రమంలో కుర్చీలో కూర్చునేందుకు కూడా ట్రంప్ ఇబ్బంది పడ్డారు.

ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారా.. విమానం దిగుతూ తడబడిన నేపథ్యంలో చర్చ..
Donald Trump health

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారా? తాజాగా ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం నుంచి దిగుతున్న సమయంలో ట్రంప్‌ను చూసిన వారిలో ఈ సందేహం మొదలైంది. అంతకు ముందు రోజు జరిగిన ఓ కార్యక్రమంలో కుర్చీలో కూర్చునేందుకు కూడా ట్రంప్ ఇబ్బంది పడ్డారు. ఈ రెండు వీడియోలను చూస్తే ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు రావడం సహజం (Donald Trump health).


ట్రంప్ శనివారం ఉదయం అధికారిక ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఫ్లోరిడా చేరుకున్నారు. అక్కడ విమానం రెయిలింగ్ పట్టుకుని జాగ్రత్తగా, నెమ్మదిగా కిందకు దిగారు. మధ్యలో ఆగుతూ, తడబడుతూ, అడుగులు జాగ్రత్తగా వేస్తూ మెట్లు దిగారు. దీనికి ముందు రోజు శుక్రవారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో కుర్చీలో కూర్చునేందుకు కూడా ట్రంప్ ఇబ్బంది పడ్డారు. ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి వార్తలు మొదలయ్యాయి (Trump Air Force One incident).


ఈ వీడియోలపై కొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు (Trump walking video). మరికొందరు మాత్రం ఇది సాధారణ విషయమే అని కొట్టిపడేశారు. ఇప్పుడే కాదు.. గతంలో కూడా ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను వైట్‌హౌస్ ఎప్పటికప్పుడూ ఖండిస్తూ వచ్చింది. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని ట్రంప్ ఇప్పటికే పలుసార్లు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హామీల అమలుకే నిధులు లేవు.. మూసీ ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడివి?: టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

ఆర్టీసీలో సూపర్‌వైజర్ ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Updated Date - Mar 22 , 2026 | 03:30 PM