Share News

కాలం చెల్లిన ఆయుధాలతో అమెరికా యుద్ధం

ABN , Publish Date - Nov 19 , 2026 | 03:20 AM

ఇరాన్‌పై చేపట్టిన ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’లో అమెరికా కాలం చెల్లిన ఆయుధాలతో దాడి చేసింది

కాలం చెల్లిన ఆయుధాలతో అమెరికా యుద్ధం
america flag

  • యూఎస్‌ నేవీ తాత్కాలిక కార్యదర్శి హంగ్‌ కావో వెల్లడి

వాషింగ్టన్‌, నవంబరు 18: ఇరాన్‌పై చేపట్టిన ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’లో అమెరికా కాలం చెల్లిన ఆయుధాలతో దాడి చేసింది. ఆయుధాల కొరత నేపథ్యంలో గతంలో కాలం తీరిన ఆయుధాలుగా వర్గీకరించిన ఆయుధాల కోడ్‌లు మార్చి వాటిని వినియోగించామని యూఎస్‌ నేవీ తాత్కాలిక కార్యదర్శి హంగ్‌ కావో పేర్కొన్నారు. అమెరికా సెనేట్‌ అడ్మిన్‌ సర్మీస్‌ కమిటీ ముందు మంగళవారం జరిగిన విచారణలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఇలా వినియోగించిన కాలం చెల్లిన ఆయుధాల్లో టోమాహాక్‌ క్షిపణులు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే, ఏ ఆయుధాలు ఎన్నింటిని ఇలా వినియోగించారనే వివరాలను వెల్లడించలేదు. గతంలో ఏడాదికి 125 టోమాహాక్‌ క్షిపణులు ఉత్పత్తి అయ్యేవని ప్రస్తుతం ఆ సంఖ్య నెలకు 60 వరకు చేరిందని హంగ్‌ కావో సెనేట్‌కు తెలియజేశారు. ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్‌ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్‌ బుధవారం డ్రోన్‌ దాడి చేసింది. దాదాపు రెండు నెలల తర్వాత కువైట్‌లో జరిగిన తొలి డ్రోన్‌ దాడి ఇది.

ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..

జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్‌.. కొట్టివేసిన సుప్రీంకోర్టు

Updated Date - Nov 19 , 2026 | 03:42 AM