Share News

శాండ్‌విచ్‌ను తుపాకీ ఆకారంలో కొరికాడని.. స్కూల్ నుంచి ఆరేళ్ల బాలుడి సస్పెన్షన్

ABN , Publish Date - Aug 01 , 2026 | 10:47 AM

శాండ్‌విచ్‌ను తుపాకీ ఆకారంలో కొరికి సహ విద్యార్థి వైపు చూపించాడనే కారణంతో ఆరేళ్ల బాలుడిని స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

శాండ్‌విచ్‌ను తుపాకీ ఆకారంలో కొరికాడని.. స్కూల్ నుంచి ఆరేళ్ల బాలుడి సస్పెన్షన్
US School Suspension

ఇంటర్నెట్ డెస్క్: శాండ్‌విచ్‌ను తుపాకీ ఆకారంలో కొరికి సహ విద్యార్థి వైపు చూపించాడనే కారణంతో ఆరేళ్ల బాలుడిని స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. జార్జియా రాష్ట్రంలోని ఓ స్కూల్‌లో ఫస్ట్ గ్రేడ్ చదువుతున్న జాన్ మెడినా అనే బాలుడికి విధించిన ఈ శిక్షపై అతడి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


మధ్యాహ్న భోజన సమయంలో జాన్ తన శాండ్‌విచ్‌ను తుపాకీ ఆకారంలో కొరికి సహ విద్యార్థి వైపు చూపించాడు. దీనిని క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణించిన పాఠశాల అధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయం తమను పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేసిందని బాలుడి తల్లి క్రిస్టిన్ మెడినా తెలిపారు. ఆటిజం ఉన్న జాన్‌పై పాఠశాల యాజమాన్యం తరచూ కఠిన చర్యలు తీసుకుంటోందని ఆమె ఆరోపించారు. 2023 నుంచి ఇప్పటివరకు 33 సార్లు క్రమశిక్షణ చర్యలు తీసుకోగా, వాటిలో 14 సస్పెన్షన్లు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో వాటర్ బాటిల్‌ను తుపాకీలా చూపిస్తూ శబ్దాలు చేశాడనే కారణంతో కూడా సస్పెండ్ చేశారన్నారు. ‘నా కుమారుడు తాను చెడ్డ పిల్లాడిననే భావనకు గురవుతున్నాడు. ఇంటికి వచ్చి 'ఐ యామ్ బ్యాడ్ కిడ్' అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తల్లిగా అది చాలా బాధ కలిగించింది’ అని క్రిస్టిన్ ఆవేదన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి:

జెర్పీ రంగు మార్పు వివాదం.. దిలీప్ టిర్కీ లేఖకు హాకీ ఇండియా వివరణ

కామన్వెల్త్ గేమ్స్: నీరజ్ చోప్రాకు రజతం.. యశ్వీర్‌కు కాంస్యం

Updated Date - Aug 01 , 2026 | 10:59 AM