Share News

ఇరాన్‌తో యుద్ధంలో 42 విమానాలను నష్టపోయిన అమెరికా

ABN , Publish Date - May 21 , 2026 | 06:03 AM

ఇరాన్‌తో యుద్ధంలో మొత్తం 42 విమానాలను కోల్పోవడమో, పాడవడమో జరిగిందని అమెరికాకు చెందిన కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ నివేదిక పేర్కొంది. వాటిలో యుద్ధ విమానాలు...

ఇరాన్‌తో యుద్ధంలో 42 విమానాలను నష్టపోయిన అమెరికా

వాషింగ్టన్‌, మే 20 : ఇరాన్‌తో యుద్ధంలో మొత్తం 42 విమానాలను కోల్పోవడమో, పాడవడమో జరిగిందని అమెరికాకు చెందిన కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీ్‌స(సీఆర్‌ఎ్‌స)నివేదిక పేర్కొంది. వాటిలో యుద్ధ విమానాలు, ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్లు కూడా ఉన్నాయి. ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ పేరిట అమెరికా ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై దాడుల్ని చేపట్టింది. ఈ దాడుల్లో నష్టపోయిన వాటిలో నాలుగు ఎఫ్‌-15ఈ యుద్ధ విమానాలు, ఒక ఎఫ్‌-35ఏ యుద్ధవిమానం, ఒక ఏ-10 థండర్‌బోల్ట్‌ 2 భూతల దాడుల యుద్ధ విమానం, ఏడు కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్‌ రీఫ్యూయలింగ్‌ విమానాలు, ఒక ఈ-3 సెంట్రీ అవాక్స్‌ విమానం, రెండు ఎంసీ-130జే కమాండో 2 ప్రత్యేక ఆపరేషన్ల విమానాలు, ఒక హెచ్‌హెచ్‌-60డబ్ల్యూ జాలీ గ్రీన్‌ 2 హెలికాప్టర్‌, 24 ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్లు, ఒక ఎంక్యూ-4సీ ట్రైటాన్‌ డ్రోన్‌ ఉన్నాయి. సీఆర్‌ఎస్‌ అమెరికా కాంగ్రెస్‌ అలాగే ఆ దేశంలోని ఇతర కమిటీలకు విధానపరమైన అంశాలపై వివరాలను అందజేస్తుంది. అమెరికా రక్షణ శాఖ,సెంట్రల్‌ కమాండ్‌ ఇచ్చే ప్రకటనలు, వార్తల ఆధారంగా సీఆర్‌ఎస్‌ తాజా నివేదికను తయారుచేసింది. కాగా పెంటగాన్‌ తాత్కాలిక కంపో్ట్రలర్‌ జూల్స్‌ డబ్ల్యూ హర్స్ట్‌ ఇరాన్‌పై చేపట్టిన యుద్ధం ఖర్చు 29 బిలియన్‌ డాలర్లకు చేరనున్నట్లు అమెరికా నిధుల కేటాయింపుల ఉప సంఘానికి మే 12న చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి...

జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

Updated Date - May 21 , 2026 | 06:03 AM