నాలుగు భారత కంపెనీలపై ఆంక్షలను తొలగించిన అమెరికా
ABN , Publish Date - Jul 02 , 2026 | 06:39 AM
రష్యాకు రక్షణ సాంకేతికతను(డిఫెన్స్ టెక్నాలజీ), యంత్ర పరికరాలను సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో గతంలో నాలుగు భారత కంపెనీలపై విధించిన ఆంక్షలను అమెరికా తాజాగా...
అందులో రెండు హైదరాబాద్ సంస్థలు
వాషింగ్టన్, జూలై 1: రష్యాకు రక్షణ సాంకేతికతను(డిఫెన్స్ టెక్నాలజీ), యంత్ర పరికరాలను సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో గతంలో నాలుగు భారత కంపెనీలపై విధించిన ఆంక్షలను అమెరికా తాజాగా తొలగించింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఆర్‌జీ ఇంజనీరింగ్ టెక్నాలజీస్, లోకేశ్ మెషీన్స్ సంస్థలు కూడా ఉన్నాయి. వీటితో పాటు అహ్మదాబాద్‌కు చెందిన గేలక్సీ బేరింగ్స్, ఢిల్లీకి చెందిన శౌర్య ఏరోనాటిక్స్ కంపెనీలపై ఆంక్షలను అమెరికా తొలగించింది. యుద్ధ పరికరాల తయారీకి వాడే మైక్రోఎలకా్ట్రనిక్స్ పరికరాలను రష్యాకు చెందిన ఆర్టెక్స్ కంపెనీకి సరఫరా చేసిందని ఆర్‌ఆర్‌జీ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ సంస్థపై, రక్షణ పరికరాల తయారీకి అవసరమైన యంత్రాలను సరఫరా చేసిందని లోకేశ్ మెషీన్స్ సంస్థపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇక, ఆయుధాల తయారీలో ఉపయోగించే రోలర్ బేరింగ్‌లను రష్యాకు సరఫరా చేస్తున్నారని గేలక్సీ బేరింగ్స్ సంస్థపై, రాడార్, నావిగేషన్ పరికరాలను విక్రయిస్తున్నారని శౌర్య ఏరోనాటిక్స్‌పై ఆంక్షలు విధించారు.
ఇవి కూడా చదవండి...
దేశంలోనే అత్యధిక పెన్షన్ల పంపిణీలో ఏపీ రికార్డ్: ఎంపీ కేశినేని శివనాథ్
కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల
Read Latest AP News And Telangana News And National News