ఇమ్రాన్ ఖాన్ తొలగింపు.. పాక్ రాజకీయాలతో తమకు సంబంధం లేదన్న అమెరికా..
ABN , Publish Date - May 20 , 2026 | 07:03 PM
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోవడం వెనుక అమెరికా హస్తముందని ఆరోపణలు వచ్చిన వేళ అగ్రరాజ్యం స్పందించింది. పాకిస్థాన్ రాజకీయాలు పూర్తిగా ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయమని తేల్చి చెప్పింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోవడం వెనుక అమెరికా హస్తముందని ఆరోపణలు వచ్చిన వేళ అగ్రరాజ్యం స్పందించింది. పాకిస్థాన్ రాజకీయాలు పూర్తిగా ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయమని తేల్చి చెప్పింది. ఇటీవల లీకైన దౌత్య పత్రంలో ఇమ్రాన్ ఖాన్ తొలగింపులో అమెరికా ఒత్తిడి ఉందనే సంచలన విషయం బయటపడింది. ఆ వార్తలపై తాజాగా అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది (Imran Khan leaked cable).
పాకిస్థాన్ అంతర్గత రాజకీయాల్లో తమ జోక్యం ఉండదని అమెరికా విదేశాంగ ప్రతినిధి తాజాగా స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ తొలగింపు వెనుక అమెరికా హస్తముందనే వార్తలను ఆయన ఖండించారు. అయితే లీకైన దౌత్య పత్రంలో కీలక విషయాల గురించి మాట్లాడడానికి ఆయన ఇష్టపడలేదు. అమెరికాలోని పాక్ రాయబారి అసద్ మజీద్ ఖాన్, అగ్రరాజ్య హోంశాఖకు చెందిన సహాయ కార్యదర్శి డోనాల్డ్ లూ మధ్య జరిగిన సమావేశం గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు (US response Pakistan cypher).
ఇమ్రాన్‌ను ప్రధాని పదవి నుంచి తొలగించి జైల్లో పెడితే, అమెరికా-పాక్ మధ్య బంధం బలపడుతుందని మజీద్ ఖాన్‌కు డోనాల్డ్ లూ చెప్పినట్టు లీకైన దౌత్య పత్రం బయటపెట్టింది (US Pakistan relations). ఆ సమావేశం జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇమ్రాన్ తన పదవిని కోల్పోయారు. తనను పదవి నుంచి తొలగించేందుకు విదేశీ కుట్ర జరుగుతోందని 2022లో ఇమ్రాన్ ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన వ్యాఖ్యలను అప్పట్లో పాక్ ప్రభుత్వం, అమెరికా ఖండించాయి. అనంతరం తోషాఖానా కేసులో ఆయనకు జైలు శిక్ష పడింది. అప్పట్నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
రెండు వందల అడుగుల ఎత్తులో నిలిచిపోయిన రోలర్ కోస్టర్.. షాకింగ్ వీడియో వైరల్..
చంద్రయాన్-3 మరో సంచలనం.. విక్రమ్ ల్యాండర్ కీలక ఆవిష్కరణ..